Share News

Hyderabad: ఉపాధ్యాయులతో ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’...

ABN , Publish Date - Aug 13 , 2024 | 09:57 AM

పాఠశాలల్లో హాజరు శాతం పెంచడంతోపాటు పిల్లలకు నాణ్యమైన విద్యా బోధన అందించేలా ప్రధానోపాధ్యాయులను ప్రోత్సహించేందుకు తొలిసారిగా ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Collector Anudeep Durishetti) తెలిపారు.

Hyderabad: ఉపాధ్యాయులతో ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’...

హైదరాబాద్‌ సిటీ: పాఠశాలల్లో హాజరు శాతం పెంచడంతోపాటు పిల్లలకు నాణ్యమైన విద్యా బోధన అందించేలా ప్రధానోపాధ్యాయులను ప్రోత్సహించేందుకు తొలిసారిగా ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Collector Anudeep Durishetti) తెలిపారు. ఈ వారం విద్యార్థుల హాజరు శాతం పెంచిన 10 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ప్రాణాలు తీసిన అతివేగం.. అసలేం జరిగిందంటే..


city3.jpg

హాజరు శాతం బాగా పెంచిన హిమాయత్‌ నగర్‌, అమీర్‌పేట్‌(Himayat Nagar, Ameerpet), సైదాపూర్‌ ఐఐ(ఈబీ), ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెహ్రూ మెమోరియల్‌ మలక్‌పేట్‌, సైదాపూర్‌ ఐఐ(ఉఆ) హైస్కూల్‌, శంకేశ్వర్‌బజార్‌, మారేడుపల్లి హైస్కూల్‌ (గర్ల్స్‌), లాలాపేట మార్కెట్‌ లాలాపేట్‌, తిరుమలగిరి, ఖైరతాబాద్‌, అంబర్‌ పేట్‌, మారేడుపల్లి హైస్కూల్‌ పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో డీఈఓ ఆర్‌.రోహిణి, ఈఓ జివి.గుప్తా పాల్గొన్నారు.


.......................................................................................................................

ఈ వార్తను కూడా చదవండి:

............................................................................................................................

Hyderabad: ప్రాణాలు తీసిన అతివేగం..

- డివైడర్‌ను ఢీ కొట్టిన బైక్‌

- ముగ్గురి మృతి

హైదరాబాద్: అతివేగంగా వెళ్తున్న ఓ బైక్‌ అదుపు తప్పి డివైడర్‌(Divider)ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతిచెందారు. ఈ సంఘటన బండ్లగూడ పోలీస్‏స్టేషన్‌(Bandlaguda Police Station) పరిధిలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ కె.సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. సైదాబాద్‌ శంకేశ్వర్‌ బజార్‌(Saidabad Shankeshwar Bazar)కు చెందిన బ్యాగరి శ్రీహరి(48) వంటమనిషి. అదే ప్రాంతానికి చెందిన సందీప్‌(20), అభిలాష్(20)లు స్నేహితులు. వీరు ముగ్గురు సైదాబాద్‌లో బంధువుల ఇంట్లో జరిగే బోనాల పండుగకు వెళ్లారు. సోమవారం తెల్లవారుజామున అభిలాష్‏ను మైలార్‌దేవ్‌పల్లిలో వదిలిపెట్టడానికి బైక్‌ (టీఎస్‌ 11 ఎఫ్‌ఏ 3972)పై బయలుదేరారు.


3.45గంటల సమయంలో చాంద్రాయణగుట్ట(Chandrayanagutta) చౌరస్తా దాటిన తర్వాత హషామాబాద్‌ షాదాబ్‌ హోటల్‌ ఎదురుగా ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తున్న బైక్‌ అదుపు తప్పడంతో డివైడర్‌ను ఢీకొట్టారు. దీంతో ముగ్గురు 20 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డారు. సందీప్‌, అభిలాష్‏లకు బలమైన గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న బండ్లగూడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తీవ్రగాయాలపాలైన శ్రీహరిని చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా కొద్దిసేపటికే అతను మృతిచెందాడు. వర్షం కురుస్తుండడంతో బైక్‌ అదుపు తప్పినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 13 , 2024 | 09:57 AM