Share News

Hyderabad: కానిస్టేబుల్‌ నాగమణి హత్య కేసు.. పోలీస్‌ అధికారిపై బదిలీ వేటు

ABN , Publish Date - Dec 13 , 2024 | 01:03 PM

రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్‌ కొంగర నాగమణి హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‏కు చెందిన ఓ పోలీస్‌ అధికారిపై రాచకొండ కమిషనర్‌ సుధీర్‌బాబు బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది.

Hyderabad: కానిస్టేబుల్‌ నాగమణి హత్య కేసు.. పోలీస్‌ అధికారిపై బదిలీ వేటు

ఇబ్రహీంపట్నం(హైదరాబాద్): రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కానిస్టేబుల్‌ కొంగర నాగమణి హత్య కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‏కు చెందిన ఓ పోలీస్‌ అధికారిపై రాచకొండ కమిషనర్‌ సుధీర్‌బాబు బదిలీ వేటు వేసినట్లు తెలుస్తోంది. రాయపోల్‌కు చెందిన నాగమణి అదే గ్రామానికి చెందిన బండారి శ్రీకాంత్‌(Srikanth)ను ప్రేమించి కులాంతర వివాహం చేసుకుంది. వీరు పెళ్లైన తర్వాత రక్షణ కోసమని ఇబ్రహీంపట్నం(Ibrahimpatnam) పోలీసులను ఆశ్రయించారు.

ఈ వార్తను కూడా చదవండి: Allu Arjun: సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌ అరెస్ట్


ఇరు వర్గాలకు కౌన్సెలింగ్‌ ఇచ్చి పంపారు. కులాంతర వివాహం చేసుకున్న అక్కపై కక్షపెంచుకున్న తమ్ముడు పరమేష్‌ పథకం వేసి నాగమణిని వేట కొడవలితో ఈనెల 2వ తేదీన ఇబ్రహీంపట్నం మండలం, రాయపోల్‌ వద్ద నరికి చంపిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఓ పోలీసు అధికారి నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలతో అతడిపై బదిలీ వేటు వేసినట్లు, కమిషనరేట్‌కు అటాచ్‌ చేసినట్లు తెలిసింది.


ఈవార్తను కూడా చదవండి: Seethakka: చర్యలు తీసుకున్నా మీరు మారరా ?

ఈవార్తను కూడా చదవండి: సీఎం సారూ.. రుణమాఫీ చేసి ఆదుకోండి!

ఈవార్తను కూడా చదవండి: తెలంగాణ సంస్కృతిపై దాడి : బండి సంజయ్‌

ఈవార్తను కూడా చదవండి: అక్కా.. నేను చనిపోతున్నా

Read Latest Telangana News and National News

Updated Date - Dec 13 , 2024 | 01:03 PM