Share News

Hyderabad: మాల్స్‏లో ‘కల్తీ’ ఆరోగ్యం...

ABN , Publish Date - Aug 02 , 2024 | 10:21 AM

మియాపూర్‌(Miyapur)లోని ఓ మాల్‌లో అనుమతికి మించి ఎక్కువ స్ర్కీన్‌లలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. హోటళ్లలోనే కాదు.. మల్టీప్లెక్సుల్లో ఆహారమూ ప్రమాణాల ప్రకారం లేదు. కాలం చెల్లిన పదార్థాలను విక్రయించడంతో పాటు.. ఆహారం తయారీలోనూ వినియోగిస్తున్నారు.

Hyderabad: మాల్స్‏లో ‘కల్తీ’ ఆరోగ్యం...

- అనుమతి ఉన్న దాని కంటే అధికంగా స్ర్కీన్‌లు

- పలుచోట్ల పార్కింగ్‌ రుసుము వసూలు

- జీహెచ్‌ఎంసీ బృందాల తనిఖీల్లో గుర్తింపు

- కఠిన చర్యలు తీసుకుంటాం: కమిషనర్‌

హైదరాబాద్‌ సిటీ: మియాపూర్‌(Miyapur)లోని ఓ మాల్‌లో అనుమతికి మించి ఎక్కువ స్ర్కీన్‌లలో సినిమాలు ప్రదర్శిస్తున్నారు. హోటళ్లలోనే కాదు.. మల్టీప్లెక్సుల్లో ఆహారమూ ప్రమాణాల ప్రకారం లేదు. కాలం చెల్లిన పదార్థాలను విక్రయించడంతో పాటు.. ఆహారం తయారీలోనూ వినియోగిస్తున్నారు. పార్కింగ్‌ రుసుము వసూలు చేయవద్దన్న నిబంధనలూ వారు పట్టించుకోవడం లేదు. సామాజిక మాధ్యమాలు, ఇతరత్రా ఫిర్యాదుల నేపథ్యంలో పార్కింగ్‌ రుసుము అక్రమ వసూలు పరిశీలనకు కమిషనర్‌ ఆమ్రపాలి(Commissioner Amrapali) సర్కిళ్ల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: సీఎం సభ సందర్భంగా.. ఎల్‌బీ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు


పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్‌ విభాగం, రెవెన్యూ, ఫుడ్‌ సేప్టీ విభాగాల అధికారులుండే బృందాలు డిప్యూటీ మునిసిపల్‌ కమిషనర్‌ నేతృత్వంలో తమ పరిధిలోని మాల్స్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో మియాపూర్‌, కూకట్‌పల్లి, మాదాపూర్‌(Miyapur, Kukatpally, Madapur) తదితర ప్రాంతాల్లో అనుమతి తీసుకున్న దాని కంటే ఎక్కువ స్ర్కీన్‌లు ఏర్పాటు చేసినట్టు గుర్తించారు. ఫుడ్‌ కోర్టుల్లోనూ నాణ్యమైన ఆహారం లేదని గుర్తించారు. ఆయా సంస్థలకు నోటీసులు జారీ చేసినట్టు అధికారులు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆమ్రపాలి హెచ్చరించారు.


మాల్స్‌లో పార్కింగ్‌ రుసుము

నిబంధనల ప్రకారం సింగిల్‌ స్ర్కీన్‌ థియేటర్లలో మాత్రమే పార్కింగ్‌ రుసుము వసూలుకు అవకాశం ఉంది. మాల్స్‌లో మొదటి అరగంట పార్కింగ్‌ ఉచితం. అంతకంటే ఎక్కువ సమయం వాహనం నిలిపితే పార్కింగ్‌ రుసుము కంటే ఎక్కువ మొత్తం కొనుగోలు చేసినా, సినిమా చూసినా పార్కింగ్‌ ఫీ వసూలు చేయకూడదు. కానీ కొన్ని మాల్స్‌లో వినియోగదారుల నుంచి జబర్దస్తీగా పార్కింగ్‌ రుసుము వసూలు చేస్తున్నట్టు అధికారులు గుర్తించి నోటీసులు ఇచ్చారు. జరిమానాలు మాత్రం విధించలేదు. పైగా, ఏ మాల్‌లో తనిఖీలు నిర్వహించారు, నిబంధనలకు విరుద్ధంగా గుర్తించిన విషయాలేంటి..? అన్న వివరాలను అధికారులు వెల్లడించడం లేదు. మాల్స్‌ వివరాలను గోప్యంగా ఉంచుతూ పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించామని చెబుతున్నారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 02 , 2024 | 10:21 AM