Share News

Hyderabad: కూల్‌.. కూల్‌.. చల్లబడిన నగరం

ABN , Publish Date - Sep 17 , 2024 | 10:01 AM

హైదరాబాద్‌ నగరం(Hyderabad city) మెల్లగా చల్లబడుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు కాస్త నెమ్మదించడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి.

Hyderabad: కూల్‌.. కూల్‌.. చల్లబడిన నగరం

- గరిష్ఠ ఉష్ణోగ్రత 31.2 డిగ్రీలు

హైదరాబాద్‌ సిటీ: హైదరాబాద్‌ నగరం(Hyderabad city) మెల్లగా చల్లబడుతోంది. ఎడతెరిపి లేకుండా కురిసిన వానలు కాస్త నెమ్మదించడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. సోమవారం రోజంతా మబ్బులు కమ్ముకున్నాయి. గ్రేటర్‌లో గరిష్ఠం 31.2 డిగ్రీలు, కనిష్ఠం 23.5 డిగ్రీలుగా ఉష్ణోగ్రత నమోదైందని, మరో రెండు రోజులపాటు ఆకాశం పాక్షికంగా మేఘావృతమై కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 4 నెలల ముందే రైళ్లన్నీ ఫుల్‌..


.................................................................................

ఈ వార్తను కూడా చదవండి:

.................................................................................

Hyderabad: సీఎం కాన్వాయ్‌ వెళ్లే దారిలో డమ్మీ బాంబు కలకలం..

- ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారించిన పోలీసులు

- షూటింగ్‌ నిమిత్తం సిద్ధం చేసినట్టు వెల్లడి

హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) కాన్వాయ్‌ వెళ్లే దారిలో డమ్మీ బాంబు కలకలం రేపింది. ఈనెల 15న సీఎం రేవంత్‌రెడ్డి కాన్వాయ్‌ ప్రయాణించే జూబ్లీహిల్స్‌ దారిలో నలుపు రంగు బ్యాగు లభించింది. దీన్ని సీఎల్‌డబ్ల్యూ అధికారులు స్వాధీనం చేసుకుని కేంద్ర కార్యాలయానికి తీసుకువెళ్లి పరిశీలించగా అందులో డమ్మీ బాంబు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ బ్యాగు ఎలా వచ్చింది అనే దానిపై పోలీసులు లోతైన దర్యాప్తు చేసి వివరాలు వెల్లడించారు. కృష్ణానగర్‌(Krishnanagar)లో ఉంటూ సినీ పరిశ్రమలో పనిచేసే ఓ వ్యక్తి ద్విచక్ర వాహనాన్ని అతడి స్నేహితుడు తీసుకుని జూబ్లీహిల్స్‌(Jubilee Hills) వైపు వచ్చాడు.

city3.jpg


ఏదో కొనుగోలు చేసి వాటిని వాహనం డిక్కీలో పెట్టేందుకు తెరవగా అందులో బ్యాగు కనిపించింది. పరిశీలించగా వైర్లు, డిస్‌ప్లే కనిపించడంతో అది బాంబు అని భయపడి అక్కడే ఉన్న ఖాళీ మైదానంలో విసిరేసి వెళ్లిపోయాడు. కొద్ది సేపటికి అటుగా వచ్చిన ఆటోడ్రైవర్‌ బ్యాగులో బాంబు ఉన్నట్టు గుర్తించి విషయాన్ని పోలీసులకు తెలపగా వారు బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించగా.. షూటింగ్‌ నిమిత్తం దీన్ని సిద్ధం చేసినట్టు తేలిందని పోలీసులు వెల్లడించారు.


ఇదికూడా చదవండి: Jani Master: జానీ మాస్టర్‌పై..లైంగిక దాడి కేసు

ఇదికూడా చదవండి: Rajagopal Reddy: పొద్దుగాల ఈ తాగుడేంది?

ఇదికూడా చదవండి: BRS: రేవంత్‌రెడ్డిపై గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం ..

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 17 , 2024 | 10:01 AM