Share News

Hyderabad: ఐపీఎల్‌ టికెట్ల పేరుతో సైబర్‌ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

ABN , Publish Date - Mar 31 , 2024 | 12:37 PM

ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) -2024 సందడి మొదలైనప్పటి నుంచి క్రికెట్‌ అభిమానులు జోష్‌ మీదున్నారు. ముఖ్యంగా ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium)లో జరుగుతున్న మ్యాచ్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది.

Hyderabad: ఐపీఎల్‌ టికెట్ల పేరుతో సైబర్‌ మోసాలు.. అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

హైదరాబాద్‌ సిటీ: ఐపీఎల్‌ (ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌) -2024 సందడి మొదలైనప్పటి నుంచి క్రికెట్‌ అభిమానులు జోష్‌ మీదున్నారు. ముఖ్యంగా ఉప్పల్‌ స్టేడియం(Uppal Stadium)లో జరుగుతున్న మ్యాచ్‌లకు విపరీతమైన డిమాండ్‌ ఉంది. రూ. 30 వేలు ఉన్న టికెట్‌ను బ్లాక్‌లో రూ. 50 వేల వరకు విక్రయిస్తున్నారంటే.. ఐపీఎల్‌ టికెట్లకు ఎంత క్రేజ్‌ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే మంచి అవకాశంగా భావించిన సైబర్‌ నేరగాళ్లు.. ఐపీఎల్‌ టికెట్ల విక్రయం పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ఏప్రిల్‌-5న ఉప్పల్‌ స్టేడియంలో జరగనున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ వర్సెస్‌ చెన్నై సూపర్‌కింగ్స్‌ మ్యాచ్‌కు టికెట్లు అందుబాటులో ఉన్నాయని, కావాల్సిన వారు బుక్‌ చేసుకోవాలని కొంతమంది సోషల్‌ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. టికెట్ల కోసం ఆశగా ఎదురుచూస్తున్న క్రికెట్‌ అభిమానులు వెంటనే ఆన్‌లైన్‌లో క్యూ కడుతున్నారు. సైబర్‌ నేరగాళ్లు క్యూఆర్‌ కోడ్‌కు డబ్బులు పంపితేనే టికెట్లు అందజేస్తామని హామీ ఇస్తున్నారు. కొంతమంది అమాయక అభిమానులు ఆన్‌లైన్‌లో డబ్బులు చెల్లిస్తున్నారు. ఆ తర్వాత ఎవరూ స్పందించకపోవడంతో లబోదిబోమంటున్నారు. విషయం పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా అప్రమత్తంగా ఉండాలని, డబ్బులు పోగొట్టుకోవద్దని సూచించారు.

Updated Date - Mar 31 , 2024 | 12:37 PM