Hyderabad: అప్పు తిరిగివ్వలేదని నిప్పు
ABN , Publish Date - Oct 31 , 2024 | 08:01 AM
తీసుకున్న అప్పు తిరిగివ్వడం లేదని ఓ వ్యాపారి టపాసుల దుకాణంపై పెట్రోలు చల్లి నిప్పంటించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేట అయ్యప్పస్వామి ఆలయ సమీపంలో ఉండే పాల వ్యాపారి సతీశ్‌రెడ్డి నుంచి నిఖిల్‌రాజ్(Nikhil Raj) తన క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేందుకు రూ.93 వేలు అప్పు తీసుకున్నాడు. నాలుగురోజుల్లో ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు.
- టపాసుల దుకాణంపై పెట్రోలు
- త్రుటిలో తప్పిన ప్రమాదం
హైదరాబాద్: తీసుకున్న అప్పు తిరిగివ్వడం లేదని ఓ వ్యాపారి టపాసుల దుకాణంపై పెట్రోలు చల్లి నిప్పంటించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాలాపేట అయ్యప్పస్వామి ఆలయ సమీపంలో ఉండే పాల వ్యాపారి సతీశ్‌రెడ్డి నుంచి నిఖిల్‌రాజ్(Nikhil Raj) తన క్రెడిట్ కార్డు బిల్లు చెల్లించేందుకు రూ.93 వేలు అప్పు తీసుకున్నాడు. నాలుగురోజుల్లో ఇస్తానని చెప్పి ఇవ్వకుండా తప్పించుకుంటున్నాడు. రెండురోజుల క్రితం ఇద్దరి మధ్య గొడవ జరిగింది.
ఈ వార్తను కూడా చదవండి: KTR: కూల్చడాలు తప్ప చేసిందేమీ లేదు
దీపావళి నేపథ్యంలో నిఖిల్‌రాజ్ లాలాపేట(Lalapet)లో బాణసంచా దుకాణం పెట్టుకున్నాడు. తీసుకున్న అప్పు ఇవ్వకపోవడంతో సతీశ్‌రెడ్డి(Satish Reddy) ఆగ్రహంతో బుధవారం తెల్లవారుజామున నిఖిల్‌రాజ్ టపాసుల దుకాణానికి పెట్రోల్‌తో నిప్పంటించి పారిపోయాడు. అక్కడే నిద్రిస్తున్న నిఖిల్‌రాజ్ మంటలు ఆర్పే యత్నంలో గాయాలపాలయ్యాడు. దుకాణానికి నిప్పు పెట్టిన నిందితుడు సతీశ్‌రెడ్డిని లాలాగూడ పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం!
ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్ వల్లే విద్యుత్ చార్జీల పెంపుపై వెనక్కి
ఈవార్తను కూడా చదవండి: Ponguleti :నిరుపేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం
ఈవార్తను కూడా చదవండి: Kaushik Reddy: నా పంచాయితీ అంతా సీఎం రేవంత్‌తోనే!
Read Latest Telangana News and National News