Hyderabad: విభిన్నం.. ఈ ఉద్యానవనం
ABN , Publish Date - Dec 07 , 2024 | 07:53 AM
సహజ అడవులను తలపించేలా కొండాపూర్(Kondapur)లోని బొటానికల్ గార్డెన్‌ను అధికారులు తీర్చిదిద్దారు. పచ్చదనంతో పాటు, విభిన్న వనాలు, నిజమైన జంతువులే అనిపించేలా ఉన్న బొమ్మలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ గార్డెన్‌లో కొత్తగా తీర్చిదిద్దిన వర్చువల్ వైల్డ్ లైవ్ సఫారీ, వృక్ష పరిచయ క్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈనెల 4న ప్రారంభించారు.
- ఆకట్టుకుంటున్న బొటానికల్ గార్డెన్
హైదరాబాద్: సహజ అడవులను తలపించేలా కొండాపూర్(Kondapur)లోని బొటానికల్ గార్డెన్‌ను అధికారులు తీర్చిదిద్దారు. పచ్చదనంతో పాటు, విభిన్న వనాలు, నిజమైన జంతువులే అనిపించేలా ఉన్న బొమ్మలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ గార్డెన్‌లో కొత్తగా తీర్చిదిద్దిన వర్చువల్ వైల్డ్ లైవ్ సఫారీ, వృక్ష పరిచయ క్షేత్రాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈనెల 4న ప్రారంభించారు. ఇక్కడ ప్రత్యేక థీమ్‌తో వనాలను అభివృద్ధి చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: హయత్‌నగర్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో పేలుడు
270 ఎకరాల్లో విస్తరించి ఉన్న బొటానికల్ గార్డెన్(Botanical Garden)ను 2017 నుంచి అటవీశాఖ అధికారులు సంరక్షిస్తున్నారు. ఇక్కడి అరుదైన మొక్కల విశిష్టతను పరిచయం చేసేందుకు పలు పాఠశాలల నుంచి విద్యార్థులను తీసుకొస్తున్నారు. ఎల్‌కేజీ, నర్సరీ విద్యార్థుల నుంచి బీఎస్సీ అగ్రికల్చర్ విద్యార్థులు తమ పరిశోధనల కోసం బొటానికల్ గార్డెన్‌ను సందర్శిస్తున్నారు. సుమారు 9కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్ ఉన్న బొటానికల్ గార్డెన్‌లో 2600మంది పాస్‌లు పొందిన రెగ్యులర్ వాకర్స్ ఉన్నారు.
పెన్సిల్, రబ్బర్ వనం: పెన్సిల్ తయారీలో వాడే మృధువైన కలప నిచ్చే చెట్లను, రబ్బర్ తయారీకి అవసరమైన పాలను ఉత్పత్తి చేసే వృక్షాలను, పెన్సిల్ ఆకారంలో నాటి ప్రత్యేకంగా వనంగా రూపొందించారు.
బొమ్మల వనం: నిర్మల్, కొండపల్లి, బొమ్మల గురించి తెలిసిందే. వీటి తయారీకి వాడే కలప చాలా మృధువుగా ఉంటుంది. వీటికి సంబంధించిన మొక్కలను కూడా మనం ఇక్కడ చూడవచ్చు.
వంటింటి వనం
మనం నిత్యం వాడే ధాన్యం, గోధుమలు తదితరాలను ఉత్పిత్తి చేసే పైర్లు, కూరగాయల, ఆకుకూరల మొక్కలతో దీన్ని రూపొందించారు. మన దేశంలోని వివిధ రాష్ట్రాల్లో 21 రకాల ఆకులను విస్తళ్ల తయారీకి ఉపయోగిస్తారు.
ధ్వజస్తంభ వనం ఆలయాల్లో ప్రతిష్టించే ధ్వజస్తంభాల తయారీకి కొన్ని ప్రత్యేక వృక్షాలను వాడతారు. వాటి మొక్కను ధ్వజస్తంభం ఆకారంలో వనాన్ని తయారు చేశారు.
తాంబూల వనం: భోజనం చేశాక పాన్ తినడం చాలా కుటుంబాల్లో అలవాటు. అందులో ఉపయోగించే తమలపాకులు, వక్కలు, లవంగాలు, యాలకులు, సోంపు తదితర మొక్కలతో మరో ప్రత్యేక వనం చూడొచ్చు.
ఇంటి పేర్ల వనం: కొందరికి ఇంటి పేర్లు రావి, మర్రి, గంధం, పత్తి, మద్ది, తంగెడి ఇలా చెట్ల పేర్లతో ముడిపడి ఉంటాయి. ఇలాంటి చెట్ల ప్రత్యేకతలు తెలిపే వనం ఇక్కడ ఉంది.
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: డ్రగ్స్, సైబర్ నేరాల విచారణకు.. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు
ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: గ్రామీణ మహిళకు నిలువెత్తు రూపం
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: రేవతి కుటుంబానికి రూ.25 లక్షలు
ఈవార్తను కూడా చదవండి: Kodangal: రెండు రోజుల కస్టడీకి పట్నం నరేందర్ రెడ్డి
Read Latest Telangana News and National News