Share News

Hyderabad: గాంధీ అంటే గౌరవమే.. తప్పయింది క్షమించండి

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:54 AM

‘గాంధీ అంటే తమకు గౌరవం ఉంది. తెలియక చేశాం.. తప్పయింది క్షమించండి’ అని బాపూజీనగర్‌(Bapujinagar)లోని గాంధీ విగ్రహం నోట్లో బాంబుపెట్టి పేల్చిన ఆకతాయిలు సోమవారం అదే విగ్రహం వద్ద వారి తల్లిదండ్రులు, స్థానికుల సమక్షంలో క్షమాపణ కోరారు.

Hyderabad: గాంధీ అంటే గౌరవమే.. తప్పయింది క్షమించండి

- క్షమాపణ కోరిన ఆకతాయిలు

బోయిన్‌పల్లి(హైదరాబాద్): ‘గాంధీ అంటే తమకు గౌరవం ఉంది. తెలియక చేశాం.. తప్పయింది క్షమించండి’ అని బాపూజీనగర్‌(Bapujinagar)లోని గాంధీ విగ్రహం నోట్లో బాంబుపెట్టి పేల్చిన ఆకతాయిలు సోమవారం అదే విగ్రహం వద్ద వారి తల్లిదండ్రులు, స్థానికుల సమక్షంలో క్షమాపణ కోరారు. బోయిన్‌పల్లి బాపూజీనగర్‌(Boinpally Bapujinagar)లో నివాసం ఉండే ఓ యువకుడు(17)తో పాటు అతడి స్నేహితులు మరో ముగ్గురు (16) శనివారం తమ బంధువులకు సంబంధించిన పెద్దకర్మ కార్యక్రమంలో మద్యం, సోషల్‌ మీడియా పైత్యంతో వారు నివాసం ఉంటున్న బస్తీలోని గాంధీ విగ్రహం వద్దకు చేరారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కూకట్‌పల్లి రైతుబజార్‌లో కూరగాయల ధరలివే..


ఈ క్రమంలో వారు దీపావళి కావడంతో బాంబులు తీసుకువచ్చి గాంధీజీ నోట్లో బాంబుపెట్టి పేల్చి వీరంగం సృష్టించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. దీంతో ఈ వీడియోను స్నాప్‌చార్ట్‌లో చూసిన స్థానికులు విషయాన్ని పోలీసులకు తెలిపారు. విచారణ చేపట్టిన బోయిన్‌పల్లి పోలీసులు(Boinpally Police) నలుగురు ఆకతాయిలను అదుపులోకి తీసుకున్నారు.


ఈ క్రమంలో తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సోమవారం అదే విగ్రహం వద్ద ఆకతాయిలు గాంధీజీ విగ్రహానికి క్షీరాభిషేకం చేసి శుద్ధి చేశారు. అనంతరం పూలమాలలు వేసి నివాళులర్పించి చెంపలు వేసుకుని పోలీసులను, స్థానికులను తల్లిదండ్రుల సమక్షంలో క్షమించమని ప్రాధేయపడ్డారు. పోలీసులు ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మంగళవారం వారిని కోర్టులో హాజరుపరచనున్నారు.


ఈవార్తను కూడా చదవండి: మినరల్‌ కాదు.. జనరల్‌ వాటరే

ఈవార్తను కూడా చదవండి: 24 గంటల విద్యుత్‌ అంటూ మోసం: హరీశ్‌రావు

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్‌, హరీశ్‌ ఇళ్ల ముందు ధర్నా చేయండి

ఈవార్తను కూడా చదవండి: అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 05 , 2024 | 11:54 AM