Share News

Hyderabad: కోకాపేటలో రూ.498 కోట్లతో జీఐఎస్‌ సబ్‌స్టేషన్‌..

ABN , Publish Date - Jun 25 , 2024 | 11:09 AM

గ్రేటర్‌ విస్తరణ.. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా కోకాపేట(Kokapet)లో 220/132/33 కేవీ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌(జీఐఎస్) నిర్మాణానికి ట్రాన్స్‌కో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Hyderabad: కోకాపేటలో రూ.498 కోట్లతో జీఐఎస్‌ సబ్‌స్టేషన్‌..

హైదరాబాద్‌ సిటీ: గ్రేటర్‌ విస్తరణ.. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌కు అనుగుణంగా కోకాపేట(Kokapet)లో 220/132/33 కేవీ గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ సబ్‌స్టేషన్‌(జీఐఎస్) నిర్మాణానికి ట్రాన్స్‌కో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. రూ.498 కోట్లతో పరిపాలన అనుమతిలిస్తూ ట్రాన్స్‌కో సీఎండీ రిజ్వీ సోమవారం ఉత్తర్వు జారీ చేశారు. 2023 ఏప్రిల్‌ 6న రూ. 519.77 కోట్ల అంచనా వ్యయంతో గతంలో ఉత్తర్వులు ఇవ్వగా, దాన్ని తాజాగా సవరించారు. అంచనా వ్యయం సుమారు రూ. 20 కోట్లు తగ్గించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 127 K రూట్‌లో ఎలక్ర్టికల్‌ ఏసీ మెట్రో లగ్జరీ బస్సులు...


కోకాపేట ఉపకేంద్రం నిర్మాణానికి రూ. 171.85 కోట్లు, కేతిరెడ్డిపల్లి- శంకర్‌పల్లి 220కేవీ నుంచి కోకాపేట వరకు 14 కిలోమీటర్ల దూరం ఓవర్‌హెడ్‌ విద్యుత్‌ లైన్లను మోనోపోల్స్‌తో నిర్మించేందుకు రూ. 136.03 కోట్లు అవుతుందని అంచనా వేశారు.

గచ్చిబౌలి- రాయదుర్గం(Gachibowli- Rayadurgam) 220 కేవీ నుంచి 10.5 కిలోమీటర్లు కోకాపేట వరకు మోనోపోల్స్‌తో ఓవర్‌ హెడ్‌లైన్లు వేసేందుకు రూ. 109.55 కోట్లు అవుతుందని అంచనాలు రూపొందించారు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 25 , 2024 | 11:20 AM