Share News

Hyderabad: హైడ్రాకు ‘పైగా’!

ABN , Publish Date - Nov 29 , 2024 | 04:59 AM

హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) కార్యాలయంగా హైదరాబాద్‌ బేగంపేటలోని పైగా ప్యాలె్‌సను ప్రభుత్వం కేటాయించింది.

Hyderabad: హైడ్రాకు ‘పైగా’!

  • అమీర్‌పేటలోనే హెచ్‌ఎండీఏ కార్యాలయం

హైదరాబాద్‌ సిటీ, నవంబరు28 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ (హైడ్రా) కార్యాలయంగా హైదరాబాద్‌ బేగంపేటలోని పైగా ప్యాలె్‌సను ప్రభుత్వం కేటాయించింది. నిజానికి, హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని పైగా ప్యాలె్‌సకు తరలించాలని తొలుత భావించారు. కానీ, హెచ్‌ఎండీఏకు పైగా ప్యాలెస్‌ సరిపోదనే ఆలోచనతో ఆ ప్రక్రియను ఆపేశారు. దీంతో హైదరాబాద్‌, అమీర్‌పేటలోని స్వర్ణజయంతి కాంప్లెక్స్‌లోనే హెచ్‌ఎండీఏ కార్యాలయం కొనసాగనుంది. హెచ్‌ఎండీఏ అధికారులు కూడా పైగా ప్యాలె్‌సను త్వరలోనే జీహెచ్‌ఎంసీకి అప్పగించనున్నారు. దీంతో ప్రస్తుతం బుద్దభవన్‌ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తోన్న హైడ్రా త్వరలోనే బేగంపేటకు మారే అవకాశముంది.

Updated Date - Nov 29 , 2024 | 04:59 AM