Hyderabad: తక్కువ ఫీజుతో అమెరికాలో ఉన్నతవిద్య..
ABN , Publish Date - Jul 21 , 2024 | 11:14 AM
సాధారణ కుటుంబాలకు చెందిన వారు కూడా తక్కువ ఫీజుతో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించవచ్చునని వెబ్‌స్టర్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్(Webster University Vice President Shyam) అన్నారు.
- వెబ్‌స్టర్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్
హైదరాబాద్ సిటీ: సాధారణ కుటుంబాలకు చెందిన వారు కూడా తక్కువ ఫీజుతో అమెరికాలో ఉన్నత విద్య అభ్యసించవచ్చునని వెబ్‌స్టర్ యూనివర్సిటీ వైస్ ప్రెసిడెంట్ శ్యామ్(Webster University Vice President Shyam) అన్నారు. అమెరికాలో మాస్టర్స్(ఎంఎస్) చేసేందుకు సన్నద్ధమైన విద్యార్థులకు హైదరాబాద్‌లో శనివారం ప్రి-డిపార్చర్ కార్యక్రమం నిర్వహించారు. శ్యామ్ మాట్లాడుతూ రెండేళ్ల ఎంఎస్ కోర్సును వెబ్‌స్టర్ యూనివర్సిటీలో రూ.23 లక్షల ఫీజుతో పూర్తి చేయవచ్చని తెలిపారు.
ఇదికూడా చదవండి: Hyderabad: మెట్రో రైళ్లపై ఎల్అండ్టీ దృష్టి..
యూనివర్సిటీకి అమెరికాలో మూడు ప్రాంతాల్లో క్యాంప్‌సలున్నాయని, 142 దేశాలకు చెందిన సుమారు 3,500 మంది విద్యనభ్యసిస్తున్నారని చెప్పారు. వీసా పొందిన విద్యార్థులు అమెరికా ఎలా చేరుకోవాలి ? చదువు తర్వాత ఉద్యోగావకాశాలు ఎలా ? తదితరాంశాలపై అవగాహన కల్పించారు. యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ జేమ్స్, ఇండియా కోఆర్డినేటర్ దాట్ల రాజు తదితరులు పాల్గొన్నారు.
ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News