Share News

Hyderabad: పేదోడి ఆకలి తీరేదెట్లా..?

ABN , Publish Date - Aug 08 , 2024 | 10:05 AM

జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం(Jubilee Hills Constituency)లోని యూసుఫ్‏గూడ పోచమ్మ ఆలయం కేవీబీఆర్‌ స్టేడియం వద్ద, యూసుఫ్‏గూడబస్తీ లేబర్‌ అడ్డా, రెహ్మత్‌నగర్‌ మధురానగర్‌ పోలీస్‏స్టేషన్‌ సమీపంలో, బోరబండ సైట్‌-3 వెల్ఫేర్‌ కార్యాలయం వద్ద, మధురానగర్‌ స్టేట్‌ హోం(Madhuranagar State Home) సమీపంలో అన్నపూర్ణ క్యాంటీన్‌లను 2015లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు.

Hyderabad: పేదోడి ఆకలి తీరేదెట్లా..?

- అన్నపూర్ణ క్యాంటీన్‌లు నాడు కలకల.. నేడు నిరుపయోగం

- తిరిగి ప్రారంభించాలని డిమాండ్‌

ఇళ్ల మధ్య ఉన్న కొన్ని అన్నపూర్ణ క్యాంటీన్లను వేరే ప్రాంతాలకు తరలించారు. కొన్నింటిని మూసేశారు. దీంతో రూ.5 భోజనంతో కడుపునింపుకునే స్థానిక కార్మికులు కడుపాకలితో పస్తులు ఉంటున్నారు.

హైదరాబాద్: జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం(Jubilee Hills Constituency)లోని యూసుఫ్‏గూడ పోచమ్మ ఆలయం కేవీబీఆర్‌ స్టేడియం వద్ద, యూసుఫ్‏గూడబస్తీ లేబర్‌ అడ్డా, రెహ్మత్‌నగర్‌ మధురానగర్‌ పోలీస్‏స్టేషన్‌ సమీపంలో, బోరబండ సైట్‌-3 వెల్ఫేర్‌ కార్యాలయం వద్ద, మధురానగర్‌ స్టేట్‌ హోం(Madhuranagar State Home) సమీపంలో అన్నపూర్ణ క్యాంటీన్‌లను 2015లో జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రూ.5కే మధ్యాహ్నం భోజనం పెట్టేవారు. స్థానికుల అభ్యంతరాలతో కొన్నింటిని స్థల మార్పిడి చేశారు.

ఇదికూడా చదవండి: Hyderabad: 3 గంటల్లో.. 688 కేసులు..


ఇంకొన్నింటిని మూసేశారు. నాడు వందల మంది కార్మికులు, యాచకులు, బీద బిక్కి జనాల కడుపాకలి తీర్చిన అన్నపూర్ణ క్యాంటీన్‌లు నేడు పట్టించుకునే నాథుడు లేక నిరుపయోగంగా మారాయి. యూసుఫ్‏గూడబస్తీ లేబర్‌ అడ్డా కేంద్రంగా దినసరి కార్మికుల ఆకలి తీర్చడం కోసం శ్రీనగర్‌కాలనీ వెళ్లే దారిలో ఏర్పాటు చేసిన అన్నపూర్ణ క్యాంటీన్‌ భవనం నేడు శిథిలావస్థకు చేరుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి మూసేసిన అన్నపూర్ణ క్యాంటీన్‌లను తెరవాలని, కొత్తవి ఏర్పాటు చేయాలని పలు పార్టీలు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు.

city2.2.jpg


అపార్ట్‌మెంట్‌ వాళ్లు తీయమన్నారు

గతంలో మేము భోజనం చేసేటప్పుడు పక్కన ఉన్న అపార్ట్‌మెంట్‌ వాళ్లు వచ్చి అన్నపూర్ణ క్యాంటీన్‌ను తీసేయాలని భోజనం వడ్డించే వాళ్లతో గొడవపడ్డారు. అధికారులూ వారికే వత్తాసు పలికారు. క్యాంటీన్‌ను మూసేయించారు.

- వెంకటరమణ, తాపిమేస్తీ


రెండు కేంద్రాలు దగ్గర దగ్గర ఉన్నాయి

యూసుఫ్‏గూడబస్తీ, స్టేట్‌ హోం రూ.5 భోజన కేంద్రాలు దగ్గర దగ్గర ఉన్నాయి. కార్మికులు ఎక్కువగా రావడం లేదు. అన్నపూర్ణ క్యాంటీన్‌ నిర్వాహకులు తెచ్చిన భోజనం మిగులుతుంది. అందుకే తాత్కాలికంగా మూసేశాం.

- కవిత, ఏఎంహెచ్‌ఓ


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Offensive Video: బిత్తిరి సత్తిపై సైబర్‌ క్రైంలో కేసు నమోదు..

Updated Date - Aug 08 , 2024 | 10:05 AM