Share News

Hyderabad: ఐసెట్‌ టాపర్లు మనోళ్లే..

ABN , Publish Date - Jun 15 , 2024 | 11:16 AM

మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ), మాస్టర్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌(ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఐసెట్‌)లో గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad) యువతీ యవకులు సత్తా చాటారు.

Hyderabad: ఐసెట్‌ టాపర్లు మనోళ్లే..

- నగర అభ్యర్థులకే తొలి మూడు ర్యాంకులు

హైదరాబాద్‌ సిటీ: మాస్టర్‌ ఆఫ్‌ బిజినెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఎంబీఏ), మాస్టర్స్‌ ఇన్‌ కంప్యూటర్‌ అప్లికేషన్‌(ఎంసీఏ) కోర్సుల్లో ప్రవేశాలకు తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ఇంటిగ్రేటెడ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌(ఐసెట్‌)లో గ్రేటర్‌ హైదరాబాద్‌(Greater Hyderabad) యువతీ యవకులు సత్తా చాటారు. శుక్రవారం విడుదలైన ఫలితాల్లో టాప్‌ టెన్‌ ర్యాంకుల్లో ఆరింటిని కైవసం చేసుకున్నారు. తొలి మూడు ర్యాంకులతో పాటు 6, 8, 9 ర్యాంకులు నగర విద్యార్థులు హస్తగతం చేసుకున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: దయచేసి అమ్మను చంపొద్దు...


జాబ్‌ చేస్తూనే రాశా..

వాసవి ఇంజనీరింగ్‌ కాలేజీలో బీటెక్‌ ఐటీ చదివా. ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ జాబ్‌ చేస్తున్నా. మంచి ర్యాంకు వస్తుందనుకున్నా కానీ, ఫస్ట్‌ ర్యాంకు వస్తుందనుకోలేదు. అమ్మ గృహిణి. నాన్న ముజీబుల్లా హుస్సేనీ సౌదీలో ఉద్యోగం చేస్తున్నారు. ఎంబీఏ చేస్తే ప్రమోషన్‌ వస్తుందని ఆశ. ఆర్థిక అవసరాల కారణంగా ఉద్యోగం వదల్లేను. ప్రస్తుతం జాబ్‌ చేస్తున్న సంస్థ సహకరిస్తే రెగ్యులర్‌గా ఎంబీఏ చదువుతా.

- మునీబుల్లా హుస్సేనీ, 1వ ర్యాంకు.


కూలీపనుల కోసం వలసొచ్చాం..

కూలీ పనుల కోసం రంగారెడ్డి జిల్లా సుద్దపల్లి నుంచి తుర్కయాంజాల్‌కు అమ్మానాన్నలతో కలిసి వలసొచ్చాం. మూడేళ్లుగా ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రిపేరవుతూ ఐసెట్‌ రాశా. టాప్‌ 2 ర్యాంకు రావడం సంతోషంగా ఉంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఎంబీఏ బిజినెస్‌ ఎనలిటిక్స్‌ చదువుతా.

- జెల్లా భరత్‌, 2వ ర్యాంకు.


ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 15 , 2024 | 11:16 AM