Share News

Hyderabad: రేపు జగన్నాథ స్వామి రథయాత్ర..

ABN , Publish Date - Jul 06 , 2024 | 09:58 AM

బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12(Banjarahills Road No. 12)లోని జగన్నాథ స్వామి రథోత్సవం ఈ నెల 7న జరగనున్నది. అదే రోజు వనవాసానికి వెళ్లి స్వామి వారు తిరిగి ఈ నెల 15న ఆలయానికి వస్తారు. ఈ నెల 17 నుంచి భక్తులకు దర్శనమిస్తారు.

Hyderabad: రేపు జగన్నాథ స్వామి రథయాత్ర..

హైదరాబాద్: బంజారాహిల్స్‌ రోడ్డు నంబరు 12(Banjarahills Road No. 12)లోని జగన్నాథ స్వామి రథోత్సవం ఈ నెల 7న జరగనున్నది. అదే రోజు వనవాసానికి వెళ్లి స్వామి వారు తిరిగి ఈ నెల 15న ఆలయానికి వస్తారు. ఈ నెల 17 నుంచి భక్తులకు దర్శనమిస్తారు. ఈ వేడుకకోసం ఆలయ నిర్వాహకులు భారీ ఏర్పాట్లు చేశారు. ట్రాఫిక్‌ పోలీసులు ప్రత్యేకంగా ఖాళీ ప్రదేశాలను గుర్తించి పార్కింగ్‌ వసతి కల్పించనున్నారు.

పూరీలో మాదిరిగానే ఇక్కడ జగన్నాథ స్వామి రథయాత్ర ప్రతియేటా నిర్వహిస్తారు. జగన్నాథుడికి, సుభద్రాదేవికి, భలభద్రుడికి ప్రత్యేకంగా రథాలు అలంకరించి ఊరేగిస్తారు. మూడు రథాలను బంగారంతో రూపొందించిన చీపురుతో శుభ్ర పరుస్తారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ఎల్లమ్మ ఆలయం వద్ద రోడ్డు మూసివేత..


యేడాది కోసం స్వామి వారి తన పరివారంతో ఆలయాన్ని వదిలి విహార యాత్రకు వెళ్తారని చరిత్ర చెబుతుంది. ఆయనను సాగనంపేందుకు రథోత్సవం నిర్వహిస్తారని పండితులు చెబుతున్నారు. రథోత్సవం తరువాత పది రోజుల పాటు స్వామి వారు ఆలయంలో ఉండరు. ఇదే సాంప్రదాయాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు. రథోత్సవం అనంతరం దేవతా విగ్రహాలను రోడ్డు నంబరు 12లో ఉన్నకనకదుర్గా దేవాలయంలో ఉంచుతారు. పది రోజుల అనంతరం వేడుకగా తిరిగి ఆలయానికి తీసుకువచ్చి ప్రతిష్ఠిస్తారు.


ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 06 , 2024 | 09:58 AM