Share News

Hyderabad: ఖాకీల ‘స్పా’ కహానీ.. అడ్డదారిలో డబ్బు సంపాదనకు దందా

ABN , Publish Date - Nov 26 , 2024 | 07:35 AM

నగరంలో పలుచోట్ల స్పా సెంటర్ల(Spa centers) ముసుగులో జరుగుతున్న అనైతిక దందాలో ఖాకీల భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. తెర ముందు తమ అనుచరులను ఉంచి..పలువురు కానిస్టేబుళ్లు, హోంగార్డులు తెరవెనుక స్పా సెంటర్లు నడుపుతున్నారు.

Hyderabad: ఖాకీల ‘స్పా’ కహానీ.. అడ్డదారిలో డబ్బు సంపాదనకు దందా

- తమ అనుచరులతో దర్జాగా కార్యకలాపాలు

- తెరవెనుక చక్రం తిప్పుతున్న కానిస్టేబుళ్లు, హోంగార్డులు

- పోలీసు ఉన్నతాధికారుల ఆరా.. చర్యలకు సిద్ధం

హైదరాబాద్‌ సిటీ: నగరంలో పలుచోట్ల స్పా సెంటర్ల(Spa centers) ముసుగులో జరుగుతున్న అనైతిక దందాలో ఖాకీల భాగస్వామ్యం ఉన్నట్లు తెలుస్తోంది. తెర ముందు తమ అనుచరులను ఉంచి..పలువురు కానిస్టేబుళ్లు, హోంగార్డులు తెరవెనుక స్పా సెంటర్లు నడుపుతున్నారు. ఈ దందా లాభసాటిగా ఉండటం, అతితక్కువ సమయంలో లక్షల్లో సంపాదన వస్తుండడంతో జోరుగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కడం, ఉన్నతాధికారులకు చేరడంతో చర్యలు తీసుకొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: చిన్నారిని చిదిమేసిన కారు..


కొద్దిరోజుల క్రితం మాదాపూర్‌ జోన్‌(Madhapur Zone) పరిధిలో పోలీసులు స్పా సెంటర్‌పై దాడులు చేయగా, అక్కడ అనైతిక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గుర్తించారు. అనంతరం తెరవెనుక ఉన్న అసలైన నిర్వాహకుడు ఎవరని ఆరా తీయగా.. హోంగార్డు అని తెలిసింది. దాంతో సదరు పోలీసులు విషయాన్ని ఉన్నతాధికారులకు చెప్పినట్లు సమాచారం. సీరియ్‌సగా భావించిన సైబరాబాద్‌ పోలీస్‌ ఉన్నతాధికారులు హోంగార్డుపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.


- ఇటీవల హైదరాబాద్‌ కమిషనరేట్‌(Hyderabad Commissionerate) పరిధిలో స్పా సెంటర్లపై టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేశారు. నిర్వాహకులను అదుపులోకి తీసుకొని విచారించగా.. ఓ ఇద్దరు కానిస్టేబుళ్లతో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు తెరవెనుక స్పా సెంటర్లకు మద్దతు ఇస్తున్నట్లు తేలింది. విషయం తెలుసుకున్న డీసీపీ.. సదరు కానిస్టేబుళ్లపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నట్లు తెలిసింది.


- కొంతమంది కానిస్టేబుళ్లు స్పా సెంటర్లు నడుపుతున్న మహిళా నిర్వాహకులతో పరిచయాలు పెంచుకొని స్పాలలో ఎంజాయ్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. నిర్వాహకులతో పరిచయం పెరిగి, సాన్నిహిత్యం ఏర్పడిన తర్వాత వారితో చెట్టపట్టాల్‌ వేసుకొని తిరుగుతున్నట్లు సైబరాబాద్‌ కమిషనరేట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. నిర్వాహకులతో కుమ్మక్కవుతూ తెరవెనుక స్పాలను నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి.


- గతంలో బాలానగర్‌ జోన్‌లో పనిచేసిన హోంగార్డు.. అతిపెద్ద కాలనీ పోలీస్‏స్టేషన్‌ పరిధిలో తన అనుచరులను ముందుపెట్టి స్పా సెంటర్‌ నడుపుతున్నట్లు తేలింది. దీంతో అతడిని మేడ్చల్‌ జోన్‌లోని ఓ పోలీస్ స్టేషన్‌కు మార్చారు. అక్కడ కూడా పద్ధతి మారకపోవడంతో కమిషనరేట్‌కు అటాచ్‌ చేసినట్లు సమాచారం.

- మాదాపూర్‌ జోన్‌ పరిధిలో ఒక ఫ్లవర్‌ పేరుతో స్పా సెంటర్‌ నడుపుతున్న నిర్వాహకులు ఏకంగా వాట్సాప్‌ కాల్స్‌ చేస్తూ కస్టమర్లను ఆకర్శిస్తున్నట్లు సమాచారం. వాట్సా్‌పలోనే అమ్మాయిల ఫొటోలు, వీడియోలు పంపుతూ.. మసాజ్‌తోపాటు అన్నిరకాల వసతులు ఉన్నాయంటూ బాహటంగానే చెప్తున్నట్లు తెలిసింది.


ఈవార్తను కూడా చదవండి: Shamshabad: బ్యాంకాక్‌ నుంచి బ్యాగుల్లో పాములు

ఈవార్తను కూడా చదవండి: Goshmahal: మలక్‌పేటకు గోషామహల్‌ స్టేడియం

ఈవార్తను కూడా చదవండి: Solar Panels: సోలార్‌ ప్యానల్స్‌తో మేలుకన్నా హాని ఎక్కువ

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 26 , 2024 | 07:35 AM