Share News

Hyderabad: కాంగ్రెస్‌ నేత అండతో భూమి కబ్జా చేశారు..

ABN , Publish Date - Nov 26 , 2024 | 09:06 AM

తన తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన రెండెకరాల 10 గుంటల భూమి కబ్జాకు గురైందని, ఆ భూమిపై తనకు హక్కులు కల్పించి పాస్‌బుక్‌ ఇప్పించాలని నల్గొండ జిల్లా దామచర్ల(Damacherla) మండలం ఇర్కిగూడెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు ప్రభుత్వాన్ని వేడుకుంది.

Hyderabad: కాంగ్రెస్‌ నేత అండతో భూమి కబ్జా చేశారు..

- నల్గొండ జిల్లాకు చెందిన సావిత్రమ్మ ఆరోపణ

హైదరాబాద్: తన తల్లి నుంచి వారసత్వంగా వచ్చిన రెండెకరాల 10 గుంటల భూమి కబ్జాకు గురైందని, ఆ భూమిపై తనకు హక్కులు కల్పించి పాస్‌బుక్‌ ఇప్పించాలని నల్గొండ జిల్లా దామచర్ల(Damacherla) మండలం ఇర్కిగూడెం గ్రామానికి చెందిన 80 ఏళ్ల వృద్ధురాలు ప్రభుత్వాన్ని వేడుకుంది. సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో బాధితురాలు లొట్లపల్లి సావిత్రమ్మ మాట్లాడింది. ఇర్కిగూడెం సర్వే నంబర్‌ 11/105లోని 2.10 ఎకరాల భూమి తన తల్లి కొటిక లచ్చమ్మ నుంచి వారసత్వంగా వచ్చిందని, దానిని 2020 వరకు సాగుచేసినట్లు తెలిపింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఉస్మానియా వర్శిటీ గేట్లు రాత్రి 9 తర్వాతే బంద్‌


తర్వాత వయస్సు పై బడడం, కుమారుడు మానసిక వైకల్యంతో బాధపడుతుండడంతో పంటలు వేయలేదని.. దీంతో భూమి పడావుగా ఉండడంతో కబ్జాదారుల కన్ను పడిందని ఆమె పేర్కొంది. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నాయకుడి మద్ధ్దతుతో కొంత మంది తనకు ఇబ్బందులు సృష్టించారని, తప్పుడు పత్రాలతో భూమిని స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది.


దీనిపై ప్రశ్నిస్తే తన కుమారుడిపై దాడి చేశారని, తనకు న్యాయం చేయాలని దామరచర్ల తహసీల్దార్‌, రెవెన్యూ అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోవడం లేదని చెప్పింది. సర్వే నంబర్‌ 11లోని భూమి ప్రభుత్వ భూమి అంటూ తహసీల్దార్‌ కలెక్టర్‌కు నివేదిక ఇచ్చారని, సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె కోరింది.


ఈవార్తను కూడా చదవండి: Shamshabad: బ్యాంకాక్‌ నుంచి బ్యాగుల్లో పాములు

ఈవార్తను కూడా చదవండి: Goshmahal: మలక్‌పేటకు గోషామహల్‌ స్టేడియం

ఈవార్తను కూడా చదవండి: Solar Panels: సోలార్‌ ప్యానల్స్‌తో మేలుకన్నా హాని ఎక్కువ

ఈవార్తను కూడా చదవండి: Hyderabad: కాంగ్రెస్ ప్రజాపాలన విజయోత్సవాలకు రంగం సిద్ధం.. పూర్తి వివరాలు ఇవే..

Read Latest Telangana News and National News

Updated Date - Nov 26 , 2024 | 09:06 AM