Share News

Hyderabad: సాయిబాబాపై దుష్ప్రచారాన్ని కలిసికట్టుగా తిప్పికొడతాం..

ABN , Publish Date - Oct 31 , 2024 | 10:03 AM

షిరిడీసాయి(Shirdi Sai) భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి, బాబాపై నమ్మకానికి బలం చేకూర్చేందుకు తెలుగు రాష్ర్టాలలో ఉన్న అన్ని సాయి ఆలయాలను కలుపుకుని ముందుకు వెళ్లనున్నట్లు షిరిడీసాయి భక్త ఐక్యవేదిక ప్రతినిధులు గుండా మల్లయ్య, ధనుంజయలు వెల్లడించారు.

Hyderabad: సాయిబాబాపై దుష్ప్రచారాన్ని కలిసికట్టుగా తిప్పికొడతాం..

- తెలుగు రాష్ర్టాల సాయి ఆలయాల ప్రతినిధులతో నవంబరులో సమావేశం

- షిరిడీ సాయి భక్త ఐక్యవేదిక ప్రతినిధి గుండా మల్లయ్య

హైదరాబాద్: షిరిడీసాయి(Shirdi Sai) భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా జరుగుతున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టి, బాబాపై నమ్మకానికి బలం చేకూర్చేందుకు తెలుగు రాష్ర్టాలలో ఉన్న అన్ని సాయి ఆలయాలను కలుపుకుని ముందుకు వెళ్లనున్నట్లు షిరిడీసాయి భక్త ఐక్యవేదిక ప్రతినిధులు గుండా మల్లయ్య, ధనుంజయలు వెల్లడించారు. భవిష్యత్తులో చేపట్టాల్సిన ప్రణాళికలు చర్చించేందుకు బుధవారం దిల్‌సుఖ్‌నగర్‌(Dilsukhnagar)లో షిరిడీసాయి భక్త ఐక్యవేదిక సమావేశం నిర్వహించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: శాంపిల్స్‌ మేమిచ్చాం.. మీరివ్వండి


ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సామాజిక మాధ్యమాల ద్వారా బాబాపై జరుగుతున్న విషప్రచారాన్ని సమర్ధవంతంగా, శాస్త్రబద్ధంగా ఎదుర్కొనేందుకు ఐక్యవేదిక కృషి చేస్తుందన్నారు. ఇందుకోసం తెలుగు ప్రభుత్వాల సహకారం కూడా తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. అవసరమైతే చట్టపరంగా కూడా చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది సాయి భక్తుల మనోభావాలను దెబ్బతీసేవిధంగా వ్యవహరించడం సరైన పద్ధతి కాదని వారు ఆవేదన వెలిబుచ్చారు.


నవంబర్‌లో తెలుగు రాష్ర్టాల సాయిబాబా ఆలయాల ప్రతినిధులతో పెద్ద ఎత్తున సమావేశాన్ని ఏర్పాటు చేసి, తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామన్నారు. కార్యక్రమంలో షిరిడీసాయి భక్త ఐక్యవేదిక ప్రతినిధులు శ్యామ్‌కుమార్‌, నర్సింహగుప్తా, సాయి, పోకల కృష్ణ, కె. సాయిబాబా, నారాయణ, ప్రము ఖ ప్రవచకులు మైనంపాటి ప్రసాద్‌, సాయి శ్రీనివాస్‌ పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం!

ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ వల్లే విద్యుత్‌ చార్జీల పెంపుపై వెనక్కి

ఈవార్తను కూడా చదవండి: Ponguleti :నిరుపేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం

ఈవార్తను కూడా చదవండి: Kaushik Reddy: నా పంచాయితీ అంతా సీఎం రేవంత్‌తోనే!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 31 , 2024 | 10:03 AM