Share News

Hyderabad: వర్గీకరణ అమలుకు పోరాడదాం.. వ్యతిరేక కుట్రలను ఎదుర్కొందాం

ABN , Publish Date - Dec 25 , 2024 | 07:20 AM

ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కుట్రలను సమర్థంగా ఎదుర్కొందామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) అన్నారు. వర్గీకరణ అమలు కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు.

Hyderabad: వర్గీకరణ అమలుకు పోరాడదాం.. వ్యతిరేక కుట్రలను ఎదుర్కొందాం

- ఫిబ్రవరి 3న ‘లక్ష డప్పులు- వెయ్యి గొంతుకల’తో సభ

హైదరాబాద్: ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక కుట్రలను సమర్థంగా ఎదుర్కొందామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Manda krishna Madiga) అన్నారు. వర్గీకరణ అమలు కోసం పోరాటం చేద్దామని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 3న మండే మాదిగల గుండె చప్పుడు ‘వెయ్యి గొంతులు-లక్ష డప్పులతో’ అంబేడ్కర్‌ విగ్రహం వద్ద సభ, దండోరా ప్రదర్శనను పురస్కరించుకుని మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సన్నాహక సమావేశం జరిగింది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సికింద్రాబాద్‌-ముజాఫర్‌పూర్‌ మధ్య వీక్లీ స్పెషల్స్‌ రైలు


ఈ సమావేశంలో మందకృష్ణ మాట్లాడుతూ.. 30 ఏళ్లుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేస్తే కొందరు ప్రతిఫలం అనుభవించకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి(Revanth Reddy) ప్రభుత్వం వర్గీకరణకు అనుకూలంగా ఉన్నా, ఆ పార్టీలో ఉన్న కొంతమంది అడ్డుకోవాలని చూస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీలో మాల సామాజికవర్గం వారి మాటే చెల్లుతుందన్నారు. వర్గీకరణ సాధన కోసం టీడీపీ, కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌(TDP, Congress, BRS) నాయకులను కలిశానని, సందర్భానుసారంగా వారికి సహాయం చేశానని తెలిపారు.


city3.2.jpg

వారు వర్గీకరణ చేస్తామని చెప్పారు కానీ, బీజేపీ మాత్రం ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని అన్నారు. వర్గీకరణ ఆలస్యమయ్యే కొద్దీ విద్య, ఉద్యోగ రంగాల్లో వాటా కోల్పోతామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి వెంటనే వర్గీకరణ చేయాలని కోరారు. ఫిబ్రవరి 3న మండే మాదిగల గుండె చప్పుడు దండోరా ప్రదర్శన సచివాలయం ఎదురుగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ప్రారంభమవుతుందన్నారు. జనవరి 2 నుంచి అన్ని జిల్లాల్లో సన్నాహక కార్యక్రమాలు, సభలు, సమావేశాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: తప్పయిపోయింది!

ఈవార్తను కూడా చదవండి: Ponguleti: తప్పు జరిగితే.. వేటు తప్పదు!

ఈవార్తను కూడా చదవండి: నేడు, రేపు మోస్తరు వర్షాలు

ఈవార్తను కూడా చదవండి: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 25 , 2024 | 07:20 AM