Share News

Hyderabad: నర్సాపూర్‌లో మహారాష్ట్ర పోలీసుల సోదాలు..

ABN , Publish Date - May 23 , 2024 | 12:02 PM

బెంగళూరు రామేశ్వరం కేఫే(Bangalore Rameswaram Cafe) బాంబు పేలుళ్లకు సంబంధం ఉందని అనుమానిస్తున్న ఓ వ్యక్తిని వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఎన్‌ఐఏ అధికారులు(NIA officials) అదుపులోకి తీసుకున్న సంఘటన మరువక ముందే మర్పల్లి మండలం, నర్సాపూర్‌ శివారులోని ఓ రహస్య స్థలంలో నిషేధిత మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారనే సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది.

Hyderabad: నర్సాపూర్‌లో మహారాష్ట్ర పోలీసుల సోదాలు..

- నిషేధిత ద్రవ మత్తు పదార్థం, తయారీ సామగ్రి స్వాధీనం

- పోలీసులు వచ్చారన్న సమాచారంతో కీలక వ్యక్తి పరార్‌

- కుటుంబ సభ్యుల్లో ఒకరిని విచారించి వదిలేసిన పోలీసులు

- కలకలం రేపిన సంఘటన

హైదరాబాద్: బెంగళూరు రామేశ్వరం కేఫే(Bangalore Rameswaram Cafe) బాంబు పేలుళ్లకు సంబంధం ఉందని అనుమానిస్తున్న ఓ వ్యక్తిని వికారాబాద్‌ జిల్లా కేంద్రంలో ఎన్‌ఐఏ అధికారులు(NIA officials) అదుపులోకి తీసుకున్న సంఘటన మరువక ముందే మర్పల్లి మండలం, నర్సాపూర్‌ శివారులోని ఓ రహస్య స్థలంలో నిషేధిత మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారనే సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు సోదాలు నిర్వహించడం కలకలం రేపింది. నర్సాపూర్‌ గ్రామంలో చెరువు పక్కనే ఉన్న ఓ వ్యవసాయ క్షేత్రంలో నిషేధిత మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారనే సమాచారంతో మహారాష్ట్ర పోలీసులు బుధవారం తెల్లవారుజామున ఆకస్మికంగా సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మహారాష్ట్ర పోలీసులు రేకుల షెడ్డులో మూడు లీటర్ల వరకు ద్రవ మత్తు పదార్థంతో పాటు నిషేధిత మత్తు పదార్థాలు తయారు చేసే సామగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది.. సంఘటన స్థలంలో స్వాధీనం చేసుకున్న సామ గ్రి వివరాలను వారు తమ ఉన్నతాధికారులకు వివరించినట్లు చెబుతున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: కోడ్‌ ముగియగానే.. విద్యుత్‌శాఖలో బదిలీలు!


సంఘటన స్థలం ఏ సర్వే నెంబర్‌లోకి వస్తుంది, యజమాని ఎవరు అనే సమాచారం కోసం మహారాష్ట్ర పోలీసులు స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం అధికారులను సంప్రదించి వివరాలు సేకరించారు. నర్సాపూర్‌ గ్రామంలోని సర్వే నెం.48లో ఉన్న పొలంలో రేకుల షెడ్డులో కొన్ని రోజులుగా నిషేధిత మత్తు పదార్థాలు తయారు చేస్తున్నారనే సమాచారంతోనే మహారాష్ట్రకు చెందిన థానే పోలీసులు ఇక్కడకు వచ్చినట్లు తెలుస్తోంది. మత్తు పదార్థాలు సరఫరా చేసే వ్యక్తుల ద్వారా రాబట్టిన సమచారం మేరకే మహారాష్ట్ర పోలీసులు ఇక్కడకు వచ్చినట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, రేకుల షెడ్డు వద్దకు పోలీసులు వచ్చిన విషయాన్ని పసిగట్టి న అక్కడున్న ఓ వ్యక్తి చెరువులో దూకి అక్కడి నుంచి పారిపోయినట్లు తెలుస్తోంది. కాగా, పారిపోయిన వ్యక్తి కుటుంబ సభ్యుల్లో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కొంత సమాచారం సేకరించి అతడిని వదిలేశారు. తాము విచారణ కు హాజరు కావాలని సమాచారం ఇచ్చినప్పుడు రావాలంటూ స్పష్టం చేసినట్లు తెలిసింది. ఇదిలా ఉంటే, రేకుల షెడ్డులో స్వాధీనం చేసుకున్న సామగ్రిని ఓ వాహనంలో తమ వెంట మహారాష్ట్రకు తరలించారు. ఈ సంఘటనపై జిల్లా, స్థానిక పోలీసులకు సమాచారం లేకపోవడం గమనార్హం.


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 23 , 2024 | 12:02 PM