Share News

Hyderabad: మినరల్‌ కాదు .. జనరల్‌ వాటరే

ABN , Publish Date - Nov 05 , 2024 | 11:07 AM

మినరల్‌ వాటర్‌(Mineral water) పేరుతో తాగునీటి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కొందరు అనుమతులు లేకుండానే శుద్ధనీటిని విక్రయిస్తున్నారని, ఇంకొందరు నీటి నాణ్యత, శుభ్రతను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. అధికారులు కూడా ఇలాంటి నీటి శుధ్ధి కేంద్రాలను చూసీచూడనట్టు వ్యవరిస్తుండటంతో నాణ్యత లేని నీటి బబుల్స్‌ (20 లీటర్ల పారదర్శక క్యాన్‌) విక్రయిస్తున్నారు.

Hyderabad: మినరల్‌ కాదు .. జనరల్‌ వాటరే

- అనుమతి లేకుండా వాటర్‌ ప్లాంట్లు

- నాణ్యత, శుభ్రత పట్టించుకోని వ్యాపారులు

- చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్న అధికారులు

హైదరాబాద్: మినరల్‌ వాటర్‌(Mineral water) పేరుతో తాగునీటి విక్రయాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. కొందరు అనుమతులు లేకుండానే శుద్ధనీటిని విక్రయిస్తున్నారని, ఇంకొందరు నీటి నాణ్యత, శుభ్రతను పట్టించుకోవడం లేదన్న ఆరోపణలున్నాయి. అధికారులు కూడా ఇలాంటి నీటి శుధ్ధి కేంద్రాలను చూసీచూడనట్టు వ్యవరిస్తుండటంతో నాణ్యత లేని నీటి బబుల్స్‌ (20 లీటర్ల పారదర్శక క్యాన్‌) విక్రయిస్తున్నారు. మినరల్‌ వాటర్‌ కాదు... అది జనరల్‌ వాటరే అని, ఆ నీరు తాగిన ప్రజలు ఆనారోగ్యాల బారినపడే అవకాశముంది.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ‘ప్రజావాణి’లో ఆంక్షలు షురూ..


నాణ్యతా ప్రమాణాలు గాలికి

అల్లాపూర్‌, బోరబండ, మాదాపూర్‌, మోతీనగర్‌(Allapur, Borabanda, Madapur, Motinagar)లలో కొన్నేళ్లుగా నీటి విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. ప్రత్యేకించి అల్లాపూర్‌ డివిజన్‌ పరిసరాల్లో సున్నం చెరువు, మైసమ్మ చెరువు, కాముని చెరువుల ఉన్నాయి. సున్నం చెరువు, కాముని చెరువు సమీపంలో కొందరు బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. అక్కడ మినరల్‌ వాటర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. ఆయా వాటర్‌ ప్లాంట్లలో బోరు వాటర్‌ను శుద్ధిచేసి మినరల్‌ వాటర్‌ పేరుతో సమీపంలోని బస్తీలు, కాలనీలు, హైటెక్‌ సిటీ(Hi-tech city)లోని కంపెనీలకు సరఫరా చేస్తున్నారు. శుధ్ధనీటి తయారీదార్ల సంస్థ పేరు, ఐఎ్‌సఐ గుర్తింపు నెంబరు లాంటివి ముద్రించకుండానే వాటిని సరఫరా చేస్తున్నారు. ప్రతి ప్లాంట్‌లోనే ల్యాబ్‌ను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు నీటి నమూనాలను పరీక్షించాల్సి ఉంటుంది. ఇవేమీ పట్టించకపోగా కనీసం బబుల్స్‌కు సీళ్లు కూడా సరిగ్గా వేయకుండా వాటిని విక్రయిస్తూ అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి.


అపరిశుభ్రం

నీటి సరఫరాకు వినియోగించే బబుళ్లను(క్యాన్లను) కడగటం లేదని, కొన్ని సందర్భాల్లో పాచిపట్టి అపరిశుభ్రంగా ఉంటున్నాయి. దాంతో వినియోగదార్లు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అధికారులు తనిఖీలు చేయకపోవడం వల్లే కొందరు వ్యాపారులు నీటిలో నాణ్యత, శుభ్రత పాటించడంలేదని ఆరోపిస్తున్నారు.

city4.2.jpg


కలుషిత నీటి సరఫరా వల్ల...

జలమండలి సరఫరా చేస్తున్న నీటిని అధిక శాతం ప్రజలు నేరుగా తాగడం లేదు, ఇందుకు కొన్ని సందర్భాలలో భూగర్భ పైపులైన్ల లీకేజీలు, డ్రైనేజీ నీటితో కలిసి కలుషితమవడం ప్రధాన కారణం. ఈ విషయమై జలమండలి అధికారులను సంప్రదిస్తే, ఏదైనా సమస్య ఉంటే తమ దృష్టికి తేవాలని, పరిశీలించి వెంటనే చర్యలు చేపడతామని పేర్కొన్నారు.


ఆటో ట్రాలీలు, వ్యాన్ల ద్వారా సరఫరా

ఆటోట్రాలీలు, వ్యాన్ల ద్వారా నిత్యం గృహాలు, వ్యాపార కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కూల్‌డ్రింక్‌ దుకాణాలకు 20 లీటర్ల క్యాన్లలో నీటిని సరఫరా చేస్తున్నారు. దుకాణాలకు 20 లీటర్ల క్యాను రూ.10 నుంచి రూ. 20 వరకు విక్రయిస్తున్నారు. గృహాలలోని ప్రజలకు రూ.20 నుంచి రూ.25 దాకా విక్రయిస్తున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Unsafe Abortions: విచ్చలవిడిగా గర్భవిచ్ఛిత్తి!

ఈవార్తను కూడా చదవండి: 24 గంటల విద్యుత్‌ అంటూ మోసం: హరీశ్‌రావు

ఈవార్తను కూడా చదవండి: కేసీఆర్‌, హరీశ్‌ ఇళ్ల ముందు ధర్నా చేయండి

ఈవార్తను కూడా చదవండి: అసంక్రమిత వ్యాధులకు ప్రత్యేక క్లినిక్‌లు

Read Latest Telangana News and National News

Updated Date - Nov 05 , 2024 | 11:11 AM