Share News

Hyderabad: ప్రతి 13 మందిలో ఒకరికి నడుము నొప్పి

ABN , Publish Date - Sep 10 , 2024 | 12:03 PM

మన దేశంలో దాదాపు ప్రతి 13 మందిలో ఒకరు నడుము నొప్పితో బాధపడుతున్నారని కిమ్స్‌ న్యూరో రీహాబిలిటేషన్‌ విభాగం డాక్టర్‌ అజయ్‌కుమార్‌, డాక్టర్‌ సిద్ధార్థ్‌(Dr. Ajay Kumar, Dr. Siddharth) తెలిపారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా కిమ్స్‌లో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో వారు మాట్లాడారు.

Hyderabad:  ప్రతి 13 మందిలో ఒకరికి నడుము నొప్పి

  • వరల్డ్‌ ఫిజియోథెరపీ డేలో వైద్యులు

హైదరాబాద్‌ సిటీ: మన దేశంలో దాదాపు ప్రతి 13 మందిలో ఒకరు నడుము నొప్పితో బాధపడుతున్నారని కిమ్స్‌ న్యూరో రీహాబిలిటేషన్‌ విభాగం డాక్టర్‌ అజయ్‌కుమార్‌, డాక్టర్‌ సిద్ధార్థ్‌(Dr. Ajay Kumar, Dr. Siddharth) తెలిపారు. ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవం సందర్భంగా కిమ్స్‌లో సోమవారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో వారు మాట్లాడారు. చిన్నచిన్న పరిష్కారాలతో ఎంతగానో బాధించే నడుమునొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చని తెలిపారు. ముందుగా మన కండరాలు ఎంత బలంగా ఉన్నాయో, వాటి సామర్థ్యం కోసం కొన్ని సులభమైన పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


ప్రధానంగా నడుము కండరాలు, పొట్ట కండరాలు, పొత్తికడుపు కండరాలు, ట్రంక్‌ సైడ్‌ కండరాలను పరీక్షిస్తామని, ఇవి చాలా తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో చేసే పరీక్షలని చెప్పారు. రోజుకు 8 నుంచి 10 గంటలపాటు కదలకుండా కుర్చీలో కూర్చుని ఉద్యోగం చేసేవారు ఇటీవల ఎక్కువగా నడుము నొప్పితో బాధపడుతున్నారని వివరించారు. సరిగ్గా కూర్చుంటే నడుము మీద భారం తక్కువగా పడుతుందని, రోడ్ల మీద గోతులు కూడా ఈ సమస్యలకు ప్రధాన కారణమన్నారు.


.........................................................................

ఈ వార్తను కూడా చదవండి:

...........................................................................

Hyderabad: 10 మంది హెచ్‌ఎంలతో ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’

హైదరాబాద్‌ సిటీ: నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేయాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి(Hyderabad Collector Anudeep Durishetti) ఉపాధ్యాయులకు సూచించారు. బస్తీలు, మురికివాడల్లోని పేదలకు మెరుగైన బోధన అందించడం ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ తాయని పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో ‘కాఫీ విత్‌ కలెక్టర్‌’ కార్యక్రమాన్ని నిర్వహించారు.


city6.jpg

ఎఫ్‌ఎల్‌ఎన్‌ యాప్‌లో గతవారం విద్యార్థుల హాజరుశాతం పెంచిన 10 పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో కలిసి కలెక్టర్‌ కాఫీ తాగి వారిని ఉత్సాహపరిచారు. హాజరుశాతాన్ని బాగా పెంచిన ఖైరతాబాద్‌, లంగర్‌హౌస్‌, హుమాయున్‌నగర్‌(Khairatabad, Langarhouse, Humayunnagar), నల్లకుంట, ఎల్లారెడ్డిగూడ, నాంపల్లి సెక్షన్‌ కాలనీ ఎన్‌ఆర్‌ఆర్‌పురం, రసూల్‌పురా పోలీస్‌లైన్‌, తిరుమలగిరి, అంబర్‌పేట, అమీర్‌పేట ధరంకరం రోడ్డు పాఠశాలల హెచ్‌ఎంలను కలెక్టర్‌ అభినందించారు. కార్యక్రమంలో డీఈవో రోహిణి పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి:Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి:Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read LatestTelangana NewsandNational News

Updated Date - Sep 10 , 2024 | 12:03 PM