Share News

Hyderabad: ప్రతి 4 జంటల్లో ఒకరికి సంతానోత్పత్తి సమస్య

ABN , Publish Date - Oct 25 , 2024 | 09:57 AM

భారతదేశంలో పలు కారణాలతో ప్రతి నాలుగు జంటల్లో ఒకరు సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్నారని ఒయాసిస్‌ ఫెర్టిలిటీ వ్యవస్థాపకులు, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దుర్గాజిరావు(Medical Director Dr. Durgaji Rao) వెల్లడించారు.

Hyderabad: ప్రతి 4 జంటల్లో ఒకరికి సంతానోత్పత్తి సమస్య

- డాక్టర్‌ దుర్గా జి.రావు

హైదరాబాద్: భారతదేశంలో పలు కారణాలతో ప్రతి నాలుగు జంటల్లో ఒకరు సంతానోత్పత్తి సమస్యలు ఎదుర్కొంటున్నారని ఒయాసిస్‌ ఫెర్టిలిటీ వ్యవస్థాపకులు, మెడికల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ దుర్గాజిరావు(Medical Director Dr. Durgaji Rao) వెల్లడించారు. గురువారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: సీఐ + అడ్మిన్ ఎస్ఐ.. పైసా వసూల్


సంతానలేమి సమస్యలకు శాస్ర్తీయతతో కూడిన వైద్యం అందించడం ద్వారా మంచి ఫలితాలు ఉంటాయన్నారు. నవంబరులో నగరంలో ఒయాసిస్‏లో జరిగే ఓ కార్యక్రమంలో ఐవీఎఫ్‌ ద్వారా జన్మించిన ప్రతిభావంతులైన 10 మంది పిల్లలను ఎంపిక చేసి, వారిలో ఒక్కొక్కరికి రూ.50 వేల ఉపకార వేతనాలు అందిస్తామన్నారు. ఈ సమావేశంలో సంస్థ ఎండీ కిరణ్‌ గాదెల, సీఈవో పుష్కరరాజ్‌ షెనాయ్‌ పాల్గొన్నారు.


.........................................................................

ఈ వార్తను కూడా చదవండి:

........................................................................

Hyderabad: బాణసంచా దుకాణాలకు అనుమతి తప్పనిసరి

- జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబరిది

హైదరాబాద్‌ సిటీ: బాణసంచా విక్రయదారులు జీహెచ్‌ఎంసీ(GHMC) నుంచి తప్పనిసరిగా తాత్కాలిక అనుమతి (టెంపరరీ ట్రేడ్‌ లైసెన్స్‌) తీసుకోవాలని కమిషనర్‌ ఇలంబరిది(Commissioner Ilambaridi) సూచించారు. లైసెన్స్‌ లేకుండా దుకాణాలను ఏర్పాటుచేస్తే చర్యలుంటాయని హెచ్చరించారు. తాత్కాలిక ట్రేడ్‌ ఐడెంటిఫికేషన్‌ నంబర్‌ కోసం పౌర సేవా కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ వైబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

city5.jpg


గుర్తింపు రుజువునకు ఆధార్‌/పాన్‌ కార్డు ప్రతులు సమర్పించాలన్నారు. జనావాసాల మధ్య, ఫుట్‌పాత్‌లపైన దుకాణాలు ఏర్పాటు చేయవద్దని సూచించారు. దుకాణాలకు సమీపంలో బాణసంచా కాల్చవద్దని, ఏదైనా దుర్ఘటన జరిగితే దుకాణదారుడిదే పూర్తి బాధ్యత అని తాత్కాలిక ట్రేడ్‌ లైసెన్స్‌లో స్పష్టంగా ఉంటుందన్నారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: ఉద్యోగులకు రెండు డీఏలు!

ఈవార్తను కూడా చదవండి: KTR: ఒకటి, రెండేళ్లు జైలుకు వెళ్లడానికైనా సిద్ధమే

ఈవార్తను కూడా చదవండి: రాష్ట్రంలోనే సొంతంగా సీడ్‌ గార్డెన్‌: తుమ్మల

ఈవార్తను కూడా చదవండి: నేడు సింగరేణి కార్మికులకు దీపావళి బోనస్‌

Read Latest Telangana News and National News

Updated Date - Oct 25 , 2024 | 10:02 AM