Hyderabad: ఉదయం పూట ఉల్లిదోసె.. నగరవాసుల ఫేవరెట్ బ్రేక్‌ఫాస్ట్
ABN , Publish Date - Dec 25 , 2024 | 06:41 AM
బ్రేక్‌ఫాస్ట్‌గా నగరవాసులు ఉల్లిదోసెనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు.. దేశంలో ఉదయం పూట అత్యధికంగా దోసెను ఆర్డర్ చేసేది హైదరాబాదీలేనని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వేదిక స్విగ్గీ పేర్కొంది. ‘
- దేశంలోనే ఎక్కువగా ఆర్డర్ చేసేది ఇక్కడేనట
హైదరాబాద్ సిటీ: బ్రేక్‌ఫాస్ట్‌గా నగరవాసులు ఉల్లిదోసెనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. అంతేకాదు.. దేశంలో ఉదయం పూట అత్యధికంగా దోసెను ఆర్డర్ చేసేది హైదరాబాదీలేనని ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ వేదిక స్విగ్గీ పేర్కొంది. ‘హౌ హైదరాబాద్ స్విగ్గీడ్’ అంటూ ఓ నివేదికను విడుదల చేసింది. 2024లో ఏకంగా 15.7 మిలియన్ (దాదాపు 1.57 కోట్లు) బిర్యానీలను నగర యువత ఆర్డర్ చేశారట.
ఈ వార్తను కూడా చదవండి: ఆ దాడికి నేను ప్రత్యక్ష సాక్షిని.. రఘునందన్‌రావు షాకింగ్ కామెంట్స్
కేవలం చికెన్ బిర్యానీ(Chicken Biryani) మాత్రమే కాదు పన్నీర్ బిర్యానీ, రొయ్యల బిర్యానీ, ఎగ్ బిర్యానీ, పుట్టగొడుగులు, గుడ్డు.. అన్ని రకాల బిర్యానీలూ ఇందులో ఉన్నాయి. ప్రతి నిమిషానికీ 34 బిర్యానీలను ఆర్డర్ చేస్తున్నారు. దేశంలో ఇంతగా బిర్యానీలను ఆర్డర్ చేసే నగరం మరేదీ లేదని ఆ సంస్థ అధ్యయనంలో తేలింది. టీ20 సమయంలో హైదరాబాద్‌లో అత్యధికంగా 869 వేలు చికెన్ బిర్యానీలను ఆర్డర్ చేశారు.
హైదరాబాద్(Hyderabad)లో బిర్యానీలు మాత్రమే కాదు, పిజ్జాలను కూడా ఎక్కువగానే ఆర్డర్ చేస్తున్నారు. హైదరాబాదీ అభిమాన స్వీటుగా డబుల్ కా మీటా అనే అంటారు చాలామంది. ఇప్పటికీ అంతే, ఏకంగా 2.1 లక్షల ఆర్డర్‌లు ఈ స్వీటుకు వస్తే, మదర్స్ డే రోజున మాత్రం నిమిషానికి 5 కేక్‌లను ఆర్డర్ చేశారట నగరవాసులు.
ఈవార్తను కూడా చదవండి: Allu Arjun: తప్పయిపోయింది!
ఈవార్తను కూడా చదవండి: Ponguleti: తప్పు జరిగితే.. వేటు తప్పదు!
ఈవార్తను కూడా చదవండి: నేడు, రేపు మోస్తరు వర్షాలు
ఈవార్తను కూడా చదవండి: రుణమాఫీ చేసి తీరుతాం.. ఏ ఒక్క రైతు అధైర్యపడొద్దు
Read Latest Telangana News and National News