Share News

Hyderabad: ఆపరేషన్‌ ధూల్‌పేట్‌.. గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యం

ABN , Publish Date - Aug 23 , 2024 | 08:39 AM

గంజాయిని అరికట్టేందుకు ధూల్‌పేట్‌(Dhulpet)లో ఎక్సైజ్‌ పోలీసులు ఇంటింటి సోదాలు చేస్తున్నారు. దాంతో విక్రేతలు ఇళ్లకు తాళాలు వేసి పరారవుతున్నారు. వారు ఇతర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు ప్రారంభిస్తున్నారని అధికారులు గుర్తించారు.

Hyderabad: ఆపరేషన్‌ ధూల్‌పేట్‌.. గంజాయి రహితంగా మార్చడమే లక్ష్యం

- 20 రోజుల వ్యవధిలో 30 కేసులు

- 54 మంది రిమాండ్‌

- మిగిలినవారి కోసం గాలింపు

- పోలీసులకు లీగల్‌ నోటీసులు పంపుతున్న గంజాయి విక్రేతలు

గంజాయి లేని ప్రాంతంగా మార్చేందుకు రూపొందించిన కార్యక్రమమే.. ఆపరేషన్‌ ధూల్‌పేట్‌(Operation Dhulpet). దీనిలో భాగంగా ఎక్సైజ్‌ పోలీసులు వరుస దాడులు నిర్వహిస్తున్నారు. 20 రోజుల వ్యవధిలో 30 కేసులు నమోదు చేశారు. 54 మందిని రిమాండ్‌కు తరలించారు. ధూల్‌పేట్‌లో గంజాయి విక్రయాలను పూర్తిగా అరికట్టాలని ప్రణాళికలు రచించారు. ఆగస్టు 31 నాటికి అక్కడ గంజాయి అమ్మకాలపై ఉక్కుపాదం మోపాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

హైదరాబాద్‌ సిటీ: గంజాయిని అరికట్టేందుకు ధూల్‌పేట్‌(Dhulpet)లో ఎక్సైజ్‌ పోలీసులు ఇంటింటి సోదాలు చేస్తున్నారు. దాంతో విక్రేతలు ఇళ్లకు తాళాలు వేసి పరారవుతున్నారు. వారు ఇతర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు ప్రారంభిస్తున్నారని అధికారులు గుర్తించారు. గుడుంబాకు కేరా్‌ఫగా ఉన్న ధూల్‌పేటపై 2016లో ఎక్సైజ్‌ పోలీసులు దాడులు చేసి దాన్ని నిర్మూలించారు. క్రమేణా గుడుంబా తయారీదారుల్లో కొందరు గంజాయి విక్రయాలు ప్రారంభించారు. ధూల్‌పేటలో గంజాయి వ్యాపారం చేస్తున్న 15 మంది అతితక్కువ కాలంలోనే కోట్లు గడించారు.

ఇదికూడా చదవండి: Hyderabad: ‘గాంధీ’కి గుర్తింపు.. ప్రశంసాపత్రాల అందజేత


వీరు స్థానికంగా ఉన్న దుకాణాలు, ఇళ్లలో గంజాయిని విక్రయిస్తున్నారు. ఈదందాలో పురుషులతో పాటు మహిళలు కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా ఎక్సైజ్‌ అధికారులు తనిఖీలు చేస్తుండటంతో గంజాయి విక్రేతలు డోర్‌ డెలివరీ చేయడం మొదలు పెట్టారు. దీంతో ప్రధాన విక్రయదారుల్లో ఆరుగురిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. మిగతావారి గురించి వేట ప్రారంభించారు.


28 మంది బైండోవర్‌

ఆపరేషన్‌ ధూల్‌పేట్‌లో భాగంగా 20 రోజుల వ్యవధిలో 30 కేసులు నమోదు చేసి, 54 మందిని రిమాండ్‌కు తరలించారు. 28 మందిని బైండోవర్‌ చేశారు. కాగా.. మరో 53 మంది పరారీలో ఉన్నారు. ఇప్పటి వరకు క్వింటా (100 కేజీ) గంజాయిని, 35 సెల్‌ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఆగస్టు-31 నాటికి ధూల్‌పేట్‌లో గంజాయి మూలాలు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌ లీడర్‌ ఎన్‌. అంజిరెడ్డి వెల్లడించారు.


దాడికి యత్నం.. పోలీసులకు నోటీసులు..

ఆపరేషన్‌ ధూల్‌పేట్‌లో పాల్గొన్న సిబ్బందిపై గంజాయి విక్రేతలు ఎదురుదాడులకు పాల్పడుతున్నారు. రాత్రి సమయంలో తనిఖీలు చేస్తున్నారని, మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని పోలీసులకు లీగల్‌ నోటీసులు సైతం పంపారు. గుడుంబా నిర్మూలన సమయంలో కూడా ఎదురుదాడులు జరిగాయని, అప్పుడు ఇప్పుడు కూడా ఎక్సైజ్‌ పోలీసులు భయపడకుండా విధులు నిర్వహిస్తున్నారని ఎక్సైజ్‌ సూపరింటెండెట్‌ ఎన్‌ అంజిరెడ్డి తెలిపారు.


గంజాయి విక్రయాలపై ఉక్కుపాదం

గంజాయి, గుడుంబా విక్రయాలను నిర్మూలించే దిశగా పనిచేస్తున్నాం. ప్రభుత్వం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. ధూల్‌పేటలోని గంజాయి విక్రేతల చిట్టా తయారు చేశాం. వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ పట్టుకుంటాం. గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తాం.

- ఎక్సైజ్‌ డైరెక్టర్‌ వీబీ కమలాసన్‌ రెడ్డి


ఇదికూడా చదవండి: Cyber ​​criminals: నగరంలో.. ఆగని సైబర్‌ మోసాలు..

ఇదికూడా చదవండి: Hyderabad: బెంగళూరు టు బాయ్స్‌ హాస్టల్‌..

ఇదికూడా చదవండి: Hyderabad: కారుతో ఢీకొట్టి.. కళ్లల్లో కారం చల్లి...

Read Latest Telangana News and National News

Updated Date - Aug 23 , 2024 | 08:39 AM