Share News

Hyderabad: హైదరాబాద్‏లో మరోసారి ఠాణాల ప్రక్షాళన..

ABN , Publish Date - Dec 12 , 2024 | 12:58 PM

పోలీసుల సేవలు ప్రజలకు చేరువలోకి తీసుకువచ్చేందుకు పోలీసు శాఖ సుమారు ఆరు నెలల పాటు కసరత్తు చేసి కొత్త స్టేషన్లను ఏర్పాటు చేసింది. పశ్చిమ మండలం పరిధిలో ఫిలింనగర్‌, మధురానగర్‌, బోరబండ(Filmnagar, Mathuranagar, Borabanda), మాసబ్‌ట్యాంక్‌, ఖైరతాబాద్‌ కొత్త ఠాణాలు వచ్చాయి.

Hyderabad: హైదరాబాద్‏లో మరోసారి ఠాణాల ప్రక్షాళన..

- గతేడాది ఏర్పడిన స్టేషన్ల పరిధులు సరిగ్గా లేవని యోచన

- పశ్చిమ మండలంలో మరో కొత్త ఠాణాకు ప్రతిపాదన

- ఫిలింనగర్‌, మధురానగర్‌ ఠాణాల పరిధిలోకి కొత్త ప్రాంతాలు

హైదరాబాద్: పోలీసుల సేవలు ప్రజలకు చేరువలోకి తీసుకువచ్చేందుకు పోలీసు శాఖ సుమారు ఆరు నెలల పాటు కసరత్తు చేసి కొత్త స్టేషన్లను ఏర్పాటు చేసింది. పశ్చిమ మండలం పరిధిలో ఫిలింనగర్‌, మధురానగర్‌, బోరబండ(Filmnagar, Mathuranagar, Borabanda), మాసబ్‌ట్యాంక్‌, ఖైరతాబాద్‌ కొత్త ఠాణాలు వచ్చాయి. పెద్ద ఠాణాలైన బంజారాహిల్స్‌, సైఫాబాద్‌, పంజాగుట్ట, సంజీవరెడ్డినగర్‌, జూబ్లీహిల్స్‌ ఠాణాలకు దూరంగా ఉన్న ప్రాంతాలను విడగొట్టి కొత్త వాటిలో కలిపారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఓయూలో అత్యాధునిక హాస్టల్‌ సిద్ధం..


ఈ సమయంలో రాజకీయ అభ్యంతరాలు రాకుండా ఉండేందుకు నియోజకవర్గాల ప్రాంతాలు కొత్త వాటిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఇప్పుడు కొన్ని ఠాణాలకు పరిధి చాలా తక్కువ స్థాయిలో ఉందనే వాదన వినిపిస్తోంది. ఓ స్టేషన్‌కు చెందిన సిబ్బంది కేవలం బందోబస్తుకు మాత్రమే ఉపయోగపడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అన్ని ఠాణాల్లో సిబ్బందికి ఒకే స్థాయిలో పని కల్పించేలా మరోసారి ప్రక్షాళాన చేస్తే ఆశించిన ఫలితాలు వస్తాయని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటూ పరిధులను మార్చాలని అనుకుంటున్నారు.

city9.jpg


గతంలో అనేక అభ్యంతరాలు

ఫిలింనగర్‌, మధురానగర్‌, ఖైరతాబాద్‌, మాసబ్‌ట్యాంక్‌(Filmnagar, Mathuranagar, Khairatabad, Masabtank) పోలీసుస్టేషన్ల పరిధులను ముగ్గురు అధికారులు పర్యటనలు చేసి నిర్ధారించారు. నగరంపై వీరికి బాగా పట్టు ఉండటంతో ఉన్నతాధికారులు వారు ఎంపిక చేసిన ప్రాంతాలను కొత్త ఠాణాల్లో కలపాలని నిర్ణయించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన అప్పటి ప్రజాప్రతినిధులు నియోజకవర్గంలో ఉన్న ప్రాంతాలన్నీ ఒకటి లేదా రెండు ఠాణాల పరిధిలోకి వస్తే బాగుటుందని సూచించారు. వారి సూచనల మేరకు ఠాణాల రూపకల్పనలో కొంత ఆలస్యం జరిగింది. చివరకు మే 2023లో కొత్త ఠాణాలు ఏర్పడ్డాయి. అరకొర సదుపాయాలతో ఏర్పడినప్పటికీ ప్రస్తుతం పూర్తి స్థాయి సౌకర్యాలు ఏర్పడ్డాయి. అయితే, కొన్ని ఠాణాలకు పరిధి చాలా తక్కువ ఉందనే ఆరోపణల నేపథ్యంలో అధికారులు మరోసారి ప్రక్షాళన చేస్తే అన్ని ఠాణాలకు సరైన ప్రాథాన్యత ఇచ్చినట్టు అవుతుందని భావిస్తున్నారు.


తీసివేతలు.. కూడికలు

ఠాణాల ప్రక్షాళన కోసం మూడు రోజులు పశ్చిమ మండలం పోలీసులు భారీగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఫిలింనగర్‌ పోలీసు స్టేషన్‌ ప్రధానాంశంగా మారింది. ఫిలింనగర్‌ పరిధిలో ఓయూ కాలనీ, టోలిచౌకి, గొల్కొండ ప్రాంతాలతోపాటు జూబ్లీహిల్స్‌లోని పలు కాలనీ, ఫిలింనగర్‌ బస్తీలు, కాలనీలు వస్తాయి. ఈ ప్రక్రియ వల్ల గోల్కొండ స్టేషన్‌ పరిధి చిన్నగా మారిపోయింది. అంతే కాకుండా ఫిలింనగర్‌ స్టేషన్‌ దూరాభారంగా మారిందని స్థానికులు, ప్రజాప్రతినిధులు మొదటి నుంచి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాలను టోలిచౌకి, గోల్కొండ వెళ్లే రోడ్డును తిరిగి గోల్కొండ పోలీసుస్టేషన్‌లో కలపాలని భావిస్తున్నారు.


- టోలిచౌకిలో కొత్త స్టేషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ కూడా వినిపిస్తోంది. అయితే, కొత్త ఠాణా వల్ల మరోసారి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇక ఫిలింనగర్‌ హౌసింగ్‌ సొసైటీ ఎదురుగా ఉన్న రోడ్డును జూబ్లీహిల్స్‌ నుంచి ఫిలింనగర్‌కు మారిస్తే ఎలా ఉంటుందని కూడా చర్చిస్తున్నారు.

- ఇక మధురానగర్‌ ఠాణా పరిధి కూడా పెంచాలని అనుకుంటున్నారు. జూబ్లీహిల్స్‌ పరిధిలో ఉన్న కృష్ణానగర్‌ను మధురానగర్‌లో కలపాలని యోచిస్తున్నారు. ఇప్పటికే మధురానగర్‌ స్టేషన్‌ కేసుల విషయంలో జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ పోలీసుస్టేషన్లతో పోటీ పడుతోంది. ఈ తరుణంలో మధురానగర్‌ ఠాణా పరిధిని పెంచితే వచ్చే శాంతిభద్రతల సమస్యలపై ఉన్నతాధికారులు దృష్టి సారించారు.


- ఖైరతాబాద్‌, మాసబ్‌ట్యాంక్‌ స్టేషన్ల పరిధిలో క్రైమ్‌ రేటుతో పాటు ఈ స్టేషన్ల పరిధి కూడా చాలా తక్కువ. ఈ నేపథ్యంలో వీటిలో ఏ ప్రాంతాలను కలిపితే బాగుంటుందానిపై కసరత్తు చేస్తున్నారు. సెంట్రల్‌ జోన్‌లో సైఫాబాద్‌ పోలీసుస్టేషన్‌ పరిధిని తగ్గించి ఖైరతాబాద్‌లో కలిపితే ఎలా ఉంటుందనే ప్రతిపాదన చేశారు. అయితే మౌలికంగా ఆయా ప్రాంతాల్లో పర్యటించిన అనంతరం నిర్ణయం తీసుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.


సిబ్బంది పనితీరుపైనా చర్చ..

కొత్త ఠాణాల్లో పోలీసింగ్‌ మరింత సమర్ధవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా పశ్చిమ మండలం పరిధిలోని కొత్త ఠాణాలపై తరుచూ అవినీతి ఆరోపణలు రావడంతో కింది స్థాయి సిబ్బంది సస్పెండ్‌ అయిన ఘటనలు కూడా అనేకం ఉన్నాయి. ఈ క్రమంలో ఠాణాల ప్రతిష్ట మసకబారకుండా ఉండేందుకు ఠాణా సిబ్బంది పనితీరును మరింత మెరుగుపర్చాలని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందనే దానిపై సుదీర్ఘ చర్చలు నిర్వహించారు. కొన్ని చోట్ల సిబ్బంది మార్చి లూప్‌లైన్‌లో పెడితే పరిస్థితి మెరుగుపడుతుందనే భావనకు వచ్చారు.


అయితే ఎవరు ఉంటారు....ఎంత మంది బదిలీ అవుతారనేది నగర పోలీసు కమిషనర్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మధురానగర్‌, బోరబండ ఠాణాల సిబ్బంది పరితీరుపై గత కమిషనర్‌ పెదవి విరిచిన విషయం విదితమే. ఆయన బదిలీ అయి ఉండకపోతే పంజాగుట్ట మాదిరిగా ఈ రెండు ఠాణాలు పూర్తి స్థాయిలో ప్రక్షాళన అయి ఉండేవనే వాదనలు వినిపిస్తున్నాయి. అయితే సీపీ సీవీ ఆనంద్‌ ఉన్న సిబ్బందితోనే నిర్మాణాత్మకంగా వ్యవహరించి పనితీరును మార్చాలనే భావనతో ఉన్నారు. ఏదీ ఏమైనా త్వరలో ఠాణాల స్వరూపం మారతాయనడంలో అతిశయోక్తి లేదు.


ఈవార్తను కూడా చదవండి: Special Trains: శబరిమలకు 26 ప్రత్యేక రైళ్లు: ద.మ. రైల్వే

ఈవార్తను కూడా చదవండి: హాస్టల్‌ ఫుడ్‌ పాయిజన్‌ ఘటనల్లో.. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌పై అనుమానాలు

ఈవార్తను కూడా చదవండి: విద్యార్థుల సమస్యలు పట్టవా రేవంత్‌: కవిత

ఈవార్తను కూడా చదవండి: ఉత్తమ పార్లమెంటేరియన్‌ తరహాలో ఏటా ఉత్తమ లెజిస్లేచర్‌ అవార్డు

Read Latest Telangana News and National News

Updated Date - Dec 12 , 2024 | 12:58 PM