Hyderabad: 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు కరెంట్ కట్.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Nov 14 , 2024 | 07:52 AM
మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్(Banjara Hills) ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి(ADE G.Gopi) తెలిపారు.
- నగరంలో నేడు విద్యుత్ ఉండని ప్రాంతాలివే..
హైదరాబాద్: మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్(Banjara Hills) ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి(ADE G.Gopi) తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ అమర్ సొసైటీ, మీనాక్షి ఫీడర్ల పరిధిలోని అమర్ సొసైటీ, కావూరి హిల్స్ ఫేజ్-2, ఆర్ట్ గ్యాలరీ లైన్, దుర్గం చెరువు, జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 10, 15, మాజీ కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి(Former Union Minister Jaipal Reddy) ఇంటి ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు 11కేవీ ఇందిరానగర్, దివ్య డైమండ్స్, టీవీ5 ఫీడర్ల పరిధిలోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్-1,9, టీవీ5,దుర్గం చెరువు, ఇందిరానగర్ ప్రాంతాల్లో కరెంట్ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: నిల్వచేసి.. వడ్డించి..
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
మరమ్మతుల కారణంగా గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో గురువారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు 11కేవీ ఈఎ్‌సఐ స్టాఫ్ క్వార్టర్స్, శ్రీముఖి అపార్టుమెంట్‌ఫీడర్ల పరిధిలోని ప్రశాంత్ కాలనీ, బల్కంపేట, బీకే గూడ మసీద్, ఈఎ్‌సఐ స్టాఫ్ క్వార్టర్స్, శ్రీముఖి అపార్టుమెంట్‌ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు 11కేవీ ఆర్బీఐ క్వార్టర్స్, బేగంపేట నాలా, ప్రేమ్‌నగర్ ఫీడర్ల పరిధిలోని తాతాచారి కాలనీ, బాంబే హల్వా కాంపౌండ్, పోచమ్మబస్త్తీ, ఆర్బీఐ క్వార్టర్స్, వాణి ప్రింటర్స్, గురుమూర్తి లైన్, ఎర్రగడ్డ, ప్రేమ్ నగర్, ఛత్రపతి శివాజీ నగర్, బ్రహ్మ శంకర్ లాల్ నగర్ ప్రాంతాల్లో కరెంట్ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: KTR: కొడంగల్ నుంచే రేవంత్ భరతం పడతాం
ఈవార్తను కూడా చదవండి: దాడిని ప్రోత్సహించిన వారిని వదిలిపెట్టం
ఈవార్తను కూడా చదవండి: తండ్రిని పట్టించుకోని కొడుక్కి తగిన శాస్తి
ఈవార్తను కూడా చదవండి: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు
Read Latest Telangana News and National News