Hyderabad: ఆ ఏరియాల్లో 10 గంటల నుంచి విద్యుత్ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..
ABN , Publish Date - Dec 28 , 2024 | 06:41 AM
మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి తెలిపారు.
హైదరాబాద్: మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 10.30 గంట వరకు కమ్మసంఘం, ఎంసీఆర్, ఫిలింనగర్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో.. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు అన్నపూర్ణ స్టూడియో, బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13 శ్రీరామ్‌నగర్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో.. ఉదయం 10.30 నుంచి 11 గంటల వరకు క్యాన్సర్ ఆసుపత్రి, బీఎన్‌ఆర్ హిల్స్, సిలికాన్ వ్యాలీ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో..
ఈ వార్తను కూడా చదవండి: TG News: తెలంగాణను వణికిస్తున్న పులులు
ఉదయం 11 గంటల నుంచి 11.30 వరకు నాందారి, శ్రీచైతన్య స్కూల్, ఇమేజ్ గార్డెన్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో.. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జహీరానగర్, కలెక్టర్ బంగ్లా, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్(Jubilee Hills Police Station), ప్రశాసన్ నగర్ ఆంధ్ర బ్యాంక్, గఫూర్ నగర్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 12 గంటల నుంచి 12.30 వరకు ఆరోగ్యశ్రీ, అశ్వినీ హైట్స్, న్యాయవిహార్, కాకతీయ హిల్స్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో..
మధ్యాహ్నం 12.30 గంటల నుంచి ఒంటి గంట వరకు పత్రికానగర్ ఫీడర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో.. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 1.30 వరకు హోటల్ దస్పల్లా, సాగర్ సొసైటీ, యూకో బ్యాంక్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు స్టేట్ హోమ్, సాయి ఎన్‌క్లేవ్ ఫీడర్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పేర్కొన్నారు.
గ్రీన్‌ల్యాండ్స్ ఏడీఈ పరిధిలో..
మరమ్మతుల కారణంగా గ్రీన్ ల్యాండ్స్ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎర్రగడ్డ, పాటిగడ్డ, బేగంపేట చికోటి గార్డెన్ ఫీడర్ల పరిధిలోని బీఎస్ పురి కాలనీ, సుల్తాన్ నగర్, శంకర్‌లాల్ నగర్,నటరాజ్ నగర్, నేతాజీ నగర్, పాటిగడ్డ క్వార్టర్స్, ఎన్బీటీ నగర్ కల్లు కాంపౌండ్, ప్రకాష్ నగర్, రాహుల్ బజాజ్ ఆటో వెనుక ప్రాంతం, చీకోటి గార్డెన్ ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు ఎయిర్ పోర్ట్ హ్యంగర్స్, శ్రీరామ్ నగర్ ఫీడర్ల పరిధిలోని ఐసీఐసీఐ బ్యాంక్ లైన్, భగవత్ పూర్, గగన్‌విహార్ కాలనీ, షేర్ ఖాన్ బస్తీ, రాజీవ్ నగర్, శ్రీరామ్‌నగర్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదని ఏడీఈపేర్కొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: 2025 Calendar: 2025 ఏడాదికి సెలవులు ఖరారు
ఈవార్తను కూడా చదవండి: సంగారెడ్డి సెంట్రల్ జైలు నుంచి విడుదల కానున్న లగచర్ల రైతులు
ఈవార్తను కూడా చదవండి: సీఎం రేవంత్ రెడ్డికి మాటలు ఎక్కువ చేతలు తక్కువ..
ఈవార్తను కూడా చదవండి: దారుణం.. రక్షించాల్సిన వారే ప్రాణాలు కోల్పోయారు..
Read Latest Telangana News and National News