Share News

Hyderabad: మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్‌ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Nov 13 , 2024 | 08:36 AM

మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్‌ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి తెలిపారు.

Hyderabad: మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్‌ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..

హైదరాబాద్: మరమ్మతుల కారణంగా బంజారాహిల్స్‌ ఏడీఈ(Banjara Hills ADE) పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ జి.గోపి తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎన్బీటీ నగర్‌, చిరాన్‌ ప్యాలెస్‌, మారుతినగర్‌ ఫీడర్ల పరిధిలోని లాపలమ్మ అపార్టుమెంట్‌, మేయర్‌ విజయలక్ష్మి ఇల్లు, మిథిలానగర్‌, ఎస్‌ బ్యాంక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 12, ఎస్‌కే నగర్‌, టెన్నిస్‌ కోర్ట్‌, ప్రగతి నగర్‌, మారుతీనగర్‌(Pragathi Nagar, Maruti Nagar), యూసుఫ్‏గూడ బస్తీ ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కనకదుర్గ టెంపుల్‌, గురుద్వారా ఫీడర్ల పరిధిలోని ఆనంద్‌ బంజారా కాలనీ, దుర్గా ఎన్‌క్లేవ్‌, యాదగిరినగర్‌, రహమత్‌నగర్‌ గురుద్వారా ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కేసీఆర్‌ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించాలి


గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలో..

మరమ్మతుల కారణంగా గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో బుధవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ చరణ్‌సింగ్‌ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఎల్లమ్మ టెంపుల్‌, జనప్రియ ఫీడర్ల పరిధిలోని బల్కంపేట, రేణుక ఎల్లమ్మ టెంపుల్‌, రేణుక నగర్‌, జనప్రియ అపార్టుమెంట్‌ ప్రాంతాల్లో.. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 వరకు డీకే రోడ్‌, న్యూశాస్త్రీ నగర్‌ ఫీడర్ల పరిధిలోని డీకే రోడ్‌, మాజీ సీఎం రోశయ్య ఇంటి లైన్‌, శివభాగ్‌, అవంతినగర్‌, పీఆర్‌ నగర్‌, న్యూశాస్త్రీ నగర్‌ ప్రాంతాల్లో కరెంట్‌ సరఫరా ఉండదని ఏడీఈ పేర్కొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: ‘లగచర్ల' దాడిని తీవ్రంగా పరిగణిస్తున్నాం

ఈవార్తను కూడా చదవండి: హనుమకొండ ఆస్పత్రిలో ఎలుకల స్వైరవిహారం

ఈవార్తను కూడా చదవండి: ఫిలింనగర్‌లో యువతి ఆత్మహత్య

ఈవార్తను కూడా చదవండి: ఇదేనా నీ పాలన.. రేవంత్‌పై హరీష్ కామెంట్స్

Read Latest Telangana News and National News

Updated Date - Nov 13 , 2024 | 08:36 AM