Hyderabad: ఎల్లమ్మ ఆలయం వద్ద రోడ్డు మూసివేత..
ABN , Publish Date - Jul 06 , 2024 | 09:41 AM
బల్కంపేట ఎల్లమ్మ(Balkampeta Ellamma) కల్యాణం పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎస్‌ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు(SR Nagar Traffic Police) ప్రధాన రోడ్డును ఇరువైపులా మూసివేసి వాహనాలను దారి మళ్ళిస్తున్నారు.
- వాహనాల దారి మళ్లింపు
హైదరాబాద్: బల్కంపేట ఎల్లమ్మ(Balkampeta Ellamma) కల్యాణం పనులు జరుగుతున్న నేపథ్యంలో ఎస్‌ఆర్ నగర్ ట్రాఫిక్ పోలీసులు(SR Nagar Traffic Police) ప్రధాన రోడ్డును ఇరువైపులా మూసివేసి వాహనాలను దారి మళ్ళిస్తున్నారు. నేటి నుంచి ఈ ఆంక్షలు ఈ నెల 10వ తేదీ సాయంత్రం 8 గంటల వరకు అమలులో ఉంటాయని ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ సైదులు(Traffic Inspector Saidulu) తెలిపారు.
- అమీర్‌పేట, బేగంపేట నుంచి వస్తున్న వాహనాలను ఎస్‌ఆర్‌నగర్ ట్రాఫిక్ పోలీ్‌సస్టేషన్ మీదుగా సోనీ వైన్స్, ఉమే్‌షచంద్ర విగ్రహం మీదుగా పంపిస్తున్నారు.
- సనత్‌నగర్, ఫత్తేనగర్, బేగంపేట బైపాస్ రోడ్డు నుంచివస్తున్న వాహనాలను సిక్స్ ఫీట్ రోడ్డు నుంచి, బల్కంపేట బతుకమ్మ చౌరస్తా మీదుగా ఎస్‌ఆర్‌నగర్, అమీర్‌పేట మీదుగా తరలిస్తున్నారు.
ఇదికూడా చదవండి: Police Commissioner: బోనాల పండగను ప్రశాంతంగా జరుపుకోవాలి..
4 చోట్ల వాహనాల పార్కింగ్
ఈ నెల 9న జరుగనున్న ఎల్లమ్మ కల్యాణం నేపథ్యంలో 4చోట్ల వాహనాల పార్కింగ్‌కు ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఫత్తేనగర్ రైల్వే సమీపంలోని ఫ్లైవోవర్ బ్రిడ్జి కింద ఇరు వైపులా, బల్కంపేట ప్రకృతి చికిత్సాలయం, ఎస్‌ఆర్‌నగర్‌లోని రోడ్లు భవనాల శాఖ, అమీర్‌పేటలోని శ్రీ గురుగోబింద్‌సింగ్ ప్లే గ్రౌండ్‌లలో పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. రేపటి నుంచి రోడ్లు భవనాల శాఖ కార్యాలయం పక్కన ఉన్న రోడ్డుకు అడ్డంగా బారీకేడ్లను ఏర్పాటు చేసి మూసి వేయనున్నారు.
ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News