Hyderabad: మేడ్చల్ జోన్‌లో సంగారెడ్డి సర్కిల్..
ABN , Publish Date - Jun 12 , 2024 | 12:48 PM
గ్రేటర్ చుట్టూ శివారు ప్రాంతాల్లో వేగంగా విస్తరించడం.. భారీగా విద్యుత్ డిమాండ్ పెరగడం, లక్షల సంఖ్యలో కొత్త విద్యుత్ కనెక్షన్లు(Electrical connections) వస్తుండడంతో తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) పాలనా సౌలభ్యం, విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది.
- పాలన సౌలభ్యం కోసం విద్యుత్‌శాఖ మార్పులు
- జూలై 1 నుంచి మేడ్చల్ జోన్ నుంచి సంగారెడ్డి ఆపరేషన్స్
- ఉత్తర్వులు జారీ చేసిన టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ
హైదరాబాద్ సిటీ: గ్రేటర్ చుట్టూ శివారు ప్రాంతాల్లో వేగంగా విస్తరించడం.. భారీగా విద్యుత్ డిమాండ్ పెరగడం, లక్షల సంఖ్యలో కొత్త విద్యుత్ కనెక్షన్లు(Electrical connections) వస్తుండడంతో తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(టీజీఎస్పీడీసీఎల్) పాలనా సౌలభ్యం, విద్యుత్ వినియోగదారులకు మెరుగైన సేవలే లక్ష్యంగా భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మేడ్చల్ రూరల్ జోన్ పరిధిలోని సంగారెడ్డి ఆపరేషన్ సర్కిల్‌ను మేడ్చల్ జోన్‌లో కలుపుతున్నట్లు టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ ముషారఫ్ ఫరూకీ మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. జూలై 1 నుంచి సంగారెడ్డి(Sangareddy) ఆపరేషన్ సర్కిల్ నిర్వహణ మేడ్చల్ జోన్ పరిధిలోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. సంగారెడ్డి సర్కిల్ మేడ్చల్ జోన్‌లోకి తీసుకురావడంతో ఈ జోన్‌లో సర్కిళ్ల సంఖ్య మూడుకు చేరింది. ఇప్పటికే మేడ్చల్, హబ్సిగూడ సర్కిళ్లు మేడ్చల్ జోన్ పరిధిలో ఉన్నాయి. గ్రేటర్ పరిధిలో మెట్రో, రంగారెడ్డి, మేడ్చల్ మూడు జోన్లు ఉన్నాయి. మెట్రోజోన్ పరిధిలో బంజారాహిల్స్, హైదరాబాద్ సెంట్రల్, సౌత్, సికింద్రాబాద్ ఆపరేషన్ సర్కిళ్లు పనిచేస్తున్నాయి.
ఇదికూడా చదవండి: Hyderabad: వామ్మో.. రూ. 10 కోట్లు కొల్లగొట్టేశారుగా..
రంగారెడ్డి జోన్‌లో సైబర్‌సిటీ, రాజేంద్రనగర్, సరూర్‌నగర్, వికారాబాద్ సర్కిళ్లు, మేడ్చల్ జోన్‌లో హబ్సిగూడ, మేడ్చల్ సర్కిళ్లు ఉండగా కొత్తగా సంగారెడ్డి సర్కిల్‌ను కలిపారు. సంగారెడ్డి సర్కిల్‌లో పటాన్‌చెరు, జహీరాబాద్, జోగిపేట, సంగారెడ్డి డివిజన్లు ఉండగా మొత్తం 7.91 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. ఇండస్ర్టియల్ ఏరియాతో పాటు ఎక్కువ అపార్ట్‌మెంట్లు, కొత్తకాలనీలు ఏర్పాటవుతుండటంతో విద్యుత్‌శాఖ ఈ ప్రాంతాల్లో మెరుగైన విద్యుత్ సరఫరా వ్యవస్థ ఏర్పాటు, నిర్వహణకు అధిక ప్రాధాన్యమిస్తున్నది. బీరంగూడ, ఆర్సీపురం, అమీన్‌పూర్, బొల్లారం, పటాన్‌చెరు వంటి ప్రాంతాల్లో విద్యుత్ డిమాండ్ రికార్డుస్థాయిలో పెరుగుతోంది. నగరంలో ఎలాంటి విద్యుత్ సరఫరా వ్యవస్థ ఉందో అదేతరహాలో శివారు ప్రాంతాల్లో విద్యుత్ వ్యవస్థ ఏర్పాటు చేయడంతో పాటూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని సర్కిళ్లను విద్యుత్‌శాఖ విస్తరిస్తోంది.
మేడ్చల్ జోన్‌లో సర్కిళ్లు, విద్యుత్ కనెక్షన్లు
సర్కిల్ విద్యుత్ కనెక్షన్లు
హబ్సిగూడ 8,95,038
మేడ్చల్ 8,44,514
సంగారెడ్డి 7,91,364
మొత్తం 25,30,916
ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్ తప్పదంటూ బెదిరింపులు
Read Latest Telangana News and National News
Read Latest AP News and Telugu News