Share News

Hyderabad: ‘మంద కృష్ణమాదిగ ఉద్యమ ఫలితమే ఎస్సీ వర్గీకరణ’

ABN , Publish Date - Aug 02 , 2024 | 11:40 AM

ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ముప్పై ఏళ్లుగా చేసిన నిరంతర పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని ఎల్బీనగర్‌ ఎమ్మార్పీఎస్‌ ఇన్‌చార్జి సుధాకర్‌మాదిగ(LB Nagar MMRPS Incharge Sudhakarmadiga) హర్షం వ్యక్తం చేశారు.

Hyderabad: ‘మంద కృష్ణమాదిగ ఉద్యమ ఫలితమే ఎస్సీ వర్గీకరణ’

హైదరాబాద్: ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ ముప్పై ఏళ్లుగా చేసిన నిరంతర పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని ఎల్బీనగర్‌ ఎమ్మార్పీఎస్‌ ఇన్‌చార్జి సుధాకర్‌మాదిగ(LB Nagar MMRPS Incharge Sudhakarmadiga) హర్షం వ్యక్తం చేశారు. గురువారం సుప్రీంకోర్టు వెల్లడించిన ఎస్సీ వర్గీకరణ తీర్పుకు హర్షం వ్యక్తం చేస్తూ ఎల్బీనగర్‌లోని అంబేడ్కర్‌, బాబు జగ్జీవన్‌రామ్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లు అర్పించారు. అనంతరం మందకృష్ణమాదిగ(Mandakrishnamadiga) చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి టపాసులు కాల్చి మిఠాయిలు పంపిణీ చేసి సంబురాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమార్పీఎస్‌ రాష్ట్ర కళామండలి అధ్యక్షుడు అనీల్‌ కుమార్‌, నాయకులు ప్రకాశ్‌మాదిగ, రాజుమాదిగ, శేఖర్‌మాదిగ, రాజుమాదిగ, రవిమాదిగ, చిరంజీవిమాదిగ పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: భారీ గణపతి మట్టి పనులు ప్రారంభం..


మాదిగ జాతి విజయం: ప్రభాకర్‌

చాదర్‌ఘాట్‌: ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకో ర్టు ఇచ్చిన సంచలనాత్మకమైన తీర్పు మాదిగ జాతి విజయమని మాదిగ రాజకీయ పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు చిట్టుపాక ప్రభాకర్‌మాదిగ అన్నా రు. సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనాత్మకమైన తీర్పును హర్షిస్తూ గురువారం మూసారాంబాగ్‌ చౌరస్తాలోని అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి సంబరాలు జరుపుకున్నారు. కార్యక్రమంలో సమితి ప్రతినిధులు ఇమ్మడి నాగయ్య, కలకోట్ల రమేష్‌, వెంకటస్వామి, గ్యార సతీష్‌, గంట ముత్తయ్య, జంగిడి నవీన్‌, వీరస్వామి, మహేశ్‌ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మలక్‌పేట దళిత సేవా సంఘం ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ చిత్రపటానికి అధ్యక్షుడు బాబు శ్రీనివాస్‌ క్షీరాభిషేకం చేశారు.

city5.jpg


బీజేపీ సంబరాలు

సైదాబాద్‌: ఎస్సీ వర్గీకరణను సమర్థిస్తూ సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ మాదన్నపేటలో బీజేపీ రాష్ట్ర ఎస్సీ మోర్చా మీడియా కన్వీనర్‌ జనపాల మధుకుమార్‌ ఆధ్వర్యంలో నేతలు సంబరాలు జరుపుకున్నారు. ప్రధాని మోదీ కటౌట్‌కు క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్‌ సహదేవ్‌ యాదవ్‌, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి వీరేందర్‌బాబు, నియోజకవర్గం కన్వీనర్‌ బండ వెంకట్‌రెడ్డి, ఎస్సీ మోర్చా కన్వీనర్‌ మోహనకృష్ణ, నాయకులు నాగరాజు, సుధీర్‌, ప్రదీప్‌ పాల్గొన్నారు.


ఇదికూడా చదవండి: నేను మంత్రినైనా.. నా తల్లిదండ్రులు రోజూ అడవికి వెళ్లి పనిచేసుకుంటారు

ఇదికూడా చదవండి: ‘సింగరేణి’ని కాపాడేందుకు అసెంబ్లీలో తీర్మానం చేయండి

ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Updated Date - Aug 02 , 2024 | 11:40 AM