Share News

Hyderabad: ‘మూసీ’ సుందరీకరణకు జేఏసీ ఏర్పాటు చేయండి

ABN , Publish Date - Oct 29 , 2024 | 09:47 AM

మూసీ బాధితులకు శాశ్వత పునరావాసం కల్పించిన తర్వాతనే వారిని వేరే ప్రాంతాలకు తరలించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌(Dr. Diddi Sudhakar) డిమాండ్‌ చేశారు. మూసీ సుందరీకరణకు అన్ని పార్టీలతో జేఏసీ ఏర్పాటు చేయాలని, డీపీఆర్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టును విడుదల చేయాలన్నారు.

Hyderabad: ‘మూసీ’ సుందరీకరణకు జేఏసీ ఏర్పాటు చేయండి

- ఆప్‌ రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌

హైదరాబాద్: మూసీ బాధితులకు శాశ్వత పునరావాసం కల్పించిన తర్వాతనే వారిని వేరే ప్రాంతాలకు తరలించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌) రాష్ట్ర కన్వీనర్‌ డాక్టర్‌ దిడ్డి సుధాకర్‌(Dr. Diddi Sudhakar) డిమాండ్‌ చేశారు. మూసీ సుందరీకరణకు అన్ని పార్టీలతో జేఏసీ ఏర్పాటు చేయాలని, డీపీఆర్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టును విడుదల చేయాలన్నారు. ఆప్‌ ఆధ్వర్యంలో సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మూసీబాధితుల సమావేశం సోమవారం జరిగింది. మూసీ సుందరీకరణకు తాము వ్యతిరేకం కాదనీ, ఇళ్లను అన్యాయంగా కూలిస్తే ఊరుకోబోమన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: కూకట్‌పల్లి రైతు బజార్‌లో కూరగాయల ధరలివే...


మూసీ పరివాహక ప్రాంతాల్లో నివసిస్తున్న పేదలకు పునరావాసం కల్పించకుండా వారిని రోడ్డున పడేయడం దారుణమన్నారు. సమావేశంలో మూసి బాధితుల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్‌ అఫ్సా సలాం, వైస్‌ చైర్మన్‌ సుధారాణి, ఆప్‌ రాష్ట్ర కోర్‌ కమిటీ సభ్యుడు బుర్ర రాములు గౌడ్‌, మహిళా వింగ్‌ అధ్యక్షురాలు హేమ జిల్లోజు,డాక్టర్స్‌ వింగ్‌ అధ్యక్షురాలు లక్ష్య నాయుడు, దివ్యంగా కమిటీ అధ్యక్షుడు రమేష్‌ దర్శనం, అధికార ప్రతినిధులు జావీద్‌ షరీ్‌ఫ, ఖాలీం బాబా, నేతలు ఠాకూర్‌ రాకేష్‌ సింగ్‌, ఎండీ సోహైల్‌ పాల్గొన్నారు.

city6.2.jpg


ఈవార్తను కూడా చదవండి: Food Poisoning: వామ్మో.. మోమోస్‌!

ఈవార్తను కూడా చదవండి: KTR: బుచ్చమ్మది.. రేవంత్‌ చేసిన హత్య

ఈవార్తను కూడా చదవండి: Madhuranagar: ‘ధరణి’తో మా ప్లాట్ల కబ్జా

ఈవార్తను కూడా చదవండి: Kaleshwaram Project: మేడిగడ్డతో ముంపు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 29 , 2024 | 09:47 AM