Share News

Hyderabad: దిల్‌సుఖ్‌నగర్‌లో అర్ధరాత్రి ఆకస్మిక ధర్నా..

ABN , Publish Date - Jul 14 , 2024 | 10:36 AM

దిల్‌సుఖ్‌నగర్‌(Dilsukhnagar)లో నిరుద్యోగులు శనివారం అర్ధరాత్రి ఆకస్మిక ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డీఎస్సీ వాయిదా వేయాలని, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులు పెంచిన తర్వాతే ఈ ఏడాది డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు.

Hyderabad: దిల్‌సుఖ్‌నగర్‌లో అర్ధరాత్రి ఆకస్మిక ధర్నా..

- డీఎస్సీ వాయిదా వేయాలని నిరుద్యోగుల డిమాండ్‌..

హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌(Dilsukhnagar)లో నిరుద్యోగులు శనివారం అర్ధరాత్రి ఆకస్మిక ధర్నాకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డీఎస్సీ వాయిదా వేయాలని, గ్రూప్‌-2, గ్రూప్‌-3 పోస్టులు పెంచిన తర్వాతే ఈ ఏడాది డిసెంబర్‌లో పరీక్షలు నిర్వహించాలని డిమాండ్‌ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. దిల్‌సుఖ్‌నగర్‌ రాజీవ్‌చౌక్‌(Dilsukhnagar Rajeev Chowk) నుంచి మెట్రో స్టేషన్‌ మీదుగా సరూర్‌నగర్‌ పీఎస్‌ వైపు ఈ ర్యాలీ సాగింది. ఒంటిగంట వరకూ ఆందోలన సాగుతూనే ఉంది. దీంతో మలక్‌పేట, సరూర్‌నగర్‌ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి నిరుద్యోగులకు నచ్చజెప్పి పంపించే పనుల్లో నిమగ్నమయ్యారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

ఇదికూడా చదవండి: Hyderabad: గోల్కొండ బోనాల సందర్భంగా.. ట్రాఫిక్‌ ఆంక్షలు


నిరుద్యోగ యువతి ఆత్మహత్యాయత్నం

కవాడిగూడ: గ్రూప్‌ 2, 3 పోస్టులు పెంచాలని డిమాండ్‌ చేస్తూ అశోక్‌నగర్‌లో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనలో శనివారం రాత్రి అపశ్రుతి చోటుచేసుకుంది. గ్రూప్‌ పరీక్షలకు ప్రిపేరవుతున్న భద్రాచలం(Bhadrachalam) జిల్లా కొత్తగూడేనికి చెందిన మదగం మిత్ర అనే యువతి ఆత్మహత్యాయత్నం చేసుకోవడం కలకలం రేపింది. ధర్నాలో అందరూ చూస్తుండగా డోలో650ఎంజీ మాత్రలు భారీ మోతాదులో నోట్లో వేసుకుంది. గమనించిన పోలీసులు ఆమెను హుటాహుటిన గాంధీ ఆస్పత్రికి తరలించారు.


ఇదికూడా చదవండి: హైదరాబాద్‏లో కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - Jul 14 , 2024 | 10:36 AM