Hyderabad: మలేషియాలో తెలుగు విశ్వవిద్యాలయం కోర్సులు
ABN , Publish Date - Dec 27 , 2024 | 07:17 AM
తెలుగు భాషలో నాలుగేళ్ల డిప్లొమా కోర్సును నిర్వహించడానికి మలేషియా తెలుగు సంఘం(Malaysian Telugu Association), తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో విద్యాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది.
హైదరాబాద్: తెలుగు భాషలో నాలుగేళ్ల డిప్లొమా కోర్సును నిర్వహించడానికి మలేషియా తెలుగు సంఘం(Malaysian Telugu Association), తెలుగు అసోసియేషన్ ఆఫ్ మలేషియా పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంతో విద్యాత్మక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. మలేషియాలోని రవాంగ్ పట్టణంలో గురువారం జరిగిన సమావేశంలో వర్సిటీ వీసీ ఆచార్య వెలుదండ నిత్యానందరావు, రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు, మలేషియా తెలుగు సంఘం అధ్యక్షుడు డాక్టర్ వెంకట ప్రతాప్, ఉపాధ్యక్షుడు సత్తయ్య సుధాకర్ నాయుడు, సురేష్ నాయుడు, గౌరవ సలహాదారులు అచ్చయ్యకుమార్ సమక్షంలో ఈ మేరకు ఒప్పందం జరిగింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మారిన వాతావరణం.. 20 డిగ్రీలుగా కనిష్ఠ ఉష్ణోగ్రతలు
ఈ సందర్భంగా వీసీ ఆచార్య నిత్యానందరావు మాట్లాడుతూ తమ మూలాలను గుర్తుంచుకుంటూ తెలుగు భాష పోతే తెలుగు జాతి అస్తిత్వం పోయినట్లే అన్న ఆవేదనతో మలేషియాలో స్థిరపడ్డ తెలుగు భాషాభిమానులు మదిని సోమనాయుడు, డీవీ శ్రీరాములు, అప్పలనాయుడు అర్ధ శతాబ్దంగా చేసిన కృషి ఫలితమే మలేషియాలో తెలుగు కోర్సుల ప్రారంభానికి శ్రీకారమని హర్షం వ్యక్తం చేశారు.
తెలుగు విశ్వవిద్యాలయం ప్రస్తుతం నిర్వహిస్తున్న సర్టిఫికెట్ కోర్సుతో పాటు నాలుగేళ్ల డిప్లొమా కోర్సును ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. లలిత కళారంగానికి చెందిన వివిధ సాంస్కృతిక కోర్సులను కూడా భవిష్యత్తులో తెలుగు మలేషియా సంఘం ద్వారా నిర్వహించడానికి సుముఖంగా ఉందని వీసీ తెలిపారు. తెలుగు భాషా కోర్సుల కాలపరిమితి ఒక సంవత్సరం సర్టిఫికెట్ కోర్సుతో పాటు ఏకంగా నాలుగేళ్ల డిప్లొమా కోర్సును కూడా నిర్వహించడానికి ఒప్పందం చేసుకోవడం విశేషమని,
ఇది మలేషియాలోని తెలుగు వలసదారులకు ఎంతో ప్రయోజనదాయకమని తెలుగు మలేషియా సంఘం అధ్యక్షుడు డాక్టర్ వెంకటప్రతాప్ పేర్కొన్నారు. రిజిస్ట్రార్ కోట్ల హనుమంతరావు మాట్లాడుతూ తెలుగు భాషలో సర్టిఫికెట్ కోర్సు, డిప్లొమా కోర్సుల నిర్వాహణలో భాగంగా ఉపాధ్యాయులకు శిక్షణతో పాటు సిలబస్, పరీక్షల నిర్వాహణ బాధ్యతలను తెలుగు వర్సిటీ తీసుకుంటుందని తెలిపారు.
ఈవార్తను కూడా చదవండి: ఎలాంటి ప్రలోభాలు లేకుండా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తాం
ఈవార్తను కూడా చదవండి: SBI: ఎస్‌బీఐలో 600పీవో పోస్టులకు నోటిఫికేషన్
ఈవార్తను కూడా చదవండి: ములుగు ఏజన్సీలో టెన్షన్ టెన్షన్.. మావోయిస్టుల పీఎల్‌జీఏ వారోత్సవాలు..
ఈవార్తను కూడా చదవండి: తుపాకులతో పట్టుపడిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు.. చివరికి ఆరా తీస్తే..
Read Latest Telangana News and National News