Share News

Hyderabad: ముస్తాబైన చర్లపల్లి టెర్మినల్‌..

ABN , Publish Date - Dec 20 , 2024 | 07:56 AM

అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ సర్వహంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నగరంలో రైల్వే ప్రయాణికులకు సేవలందిస్తున్న సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించి, తద్వారా నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు నాల్గోటెర్మినల్‌గా చర్లపల్లి రూపుదిద్దుకుంది.

Hyderabad: ముస్తాబైన చర్లపల్లి టెర్మినల్‌..

- ప్రారంభానికి ముహూర్తం ఖరారు

హైదరాబాద్: అధునాతనంగా నిర్మించిన చర్లపల్లి రైల్వే టెర్మినల్‌(Cherlapalli Railway Terminal) సర్వహంగులతో ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. నగరంలో రైల్వే ప్రయాణికులకు సేవలందిస్తున్న సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ(Secunderabad, Nampally, Kacheguda) స్టేషన్లపై ఒత్తిడి తగ్గించి, తద్వారా నగరంలో ట్రాఫిక్‌ రద్దీని నివారించేందుకు నాల్గోటెర్మినల్‌గా చర్లపల్లి రూపుదిద్దుకుంది. గతంలో రెండుసార్లు వాయిదా పడగా, ఎట్టకేలకు ఈ టెర్మినల్‌ను ఈనెల 28న ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారైంది.

ఈ వార్తను కూడా చదవండి: VC Sajjanar: ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ అంతా మోసమే..


city3.jpg

స్టేషన్‌లో ప్రయాణికుల సౌకర్యం కోసం ఉచిత వైఫైతో పాటు అధునాతన సదుపాయాలు కల్పించారు. అయితే, ఇరుకుగా ఉన్న అప్రోచ్‌ రోడ్లను వెడల్పు చేయడంతో పాటు కొత్త రోడ్ల నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ, వివిధ రాష్ట్ర ప్రభుత్వ విభాగాలు కసరత్తు చేస్తుండగా, మరోవైపు ప్రయాణికుల రవాణా సౌకర్యం కోసం కుషాయిగూడ, చంగిచర్ల(Kushaiguda, Changicherla) డిపోలకు చెందిన బస్సులతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాల ఆర్టీసీ డిపోల నుంచి బస్సులను నడిపేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటున్నారు.


మొత్తం నిర్మాణ వ్యయం: రూ. 430 కోట్లు

నిర్మాణ సమయం: ఆరున్నర సంవత్సరాలు (2018)

టెర్మినల్‌ మొత్తం విస్తీర్ణం: 38 ఎకరాలు

మొత్తం ప్లాట్‌ఫారాల సంఖ్య: తొమ్మిది

ఇక్కడి నుంచి ప్రారంభం కానున్న రైళ్ల సంఖ్య : 25 (2 ఎంఎంటీఎ్‌సలు)


city3.3.jpg

ఉత్తరం వైపు రోడ్డు: చర్లపల్లి పారిశ్రామికవాడ, భరత్‌నగర్‌ మీదుగా మల్లాపూర్‌, నాచారం, హబ్సిగూడ వరకు. అదేవిధంగా చంగిచర్ల మీదుగా ఘట్కేసర్‌ వైపు

దక్షిణం వైపు రోడ్డు: ఈసీఐఎల్‌, చర్లపల్లి జైలు మీదుగా మహాలక్ష్మి నగర్‌ కాలనీ వైపు ఉన్న అప్రోచ్‌ రోడ్డు

తూర్పు వైపు రోడ్డు: శివారు మండలాల గ్రామాలు ఘట్కేసర్‌, కీసర, రాంపల్లి, మీదుగా భరత్‌నగర్‌ రైల్వే ఓవర్‌ బ్రిడ్జి. లేదా మహాలక్ష్మి నగర్‌ వైపు ఉన్న అప్రోచ్‌ రోడ్డు


ఈవార్తను కూడా చదవండి: ACB Case: కేటీఆర్‌ ఏ1

ఈవార్తను కూడా చదవండి: HYDRA: మణికొండలో హైడ్రా కూల్చివేతలు!

ఈవార్తను కూడా చదవండి: Jagityala: చిన్నారుల ప్రాణాలకు ‘పెద్ద’ ముప్పు!

ఈవార్తను కూడా చదవండి: కాళేశ్వరంపై విచారణ.. హాజరైన స్మితా సబర్వాల్, సోమేష్‌కుమార్..

Read Latest Telangana News and National News

Updated Date - Dec 20 , 2024 | 07:56 AM