Hyderabad: తప్పు చేసి ఉల్టా బెదిరింపు..
ABN , Publish Date - Dec 19 , 2024 | 06:54 AM
ఓ యువకుడు బుధవారం కారులో వెళ్తున్నాడు. ఓ సిగ్నల్(Signal) వద్ద ఆపగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ యువతి స్కూటీతో అతడి కారును ఢీకొట్టింది. యువకుడు ప్రశ్నించగా.. తనది తప్పు కాదన్నట్లు ఆమె అతడితో వాదిస్తోంది.
- సిగ్నల్ వద్ద ఆగివున్న యువకుడి కారును ఢీకొట్టిన యువతి
- నన్ను ఫాలో అవుతున్నావని ఫిర్యాదు చేస్తానంటూ యువకుడికి బెదిరింపులు
- ఆ ఘటనను ప్రత్యక్షంగా వీక్షించిన కానిస్టేబుల్
- యువతికి క్లాస్ తీసుకొని పంపించిన వైనం
హైదరాబాద్ సిటీ: ఓ యువకుడు బుధవారం కారులో వెళ్తున్నాడు. ఓ సిగ్నల్(Signal) వద్ద ఆపగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన ఓ యువతి స్కూటీతో అతడి కారును ఢీకొట్టింది. యువకుడు ప్రశ్నించగా.. తనది తప్పు కాదన్నట్లు ఆమె అతడితో వాదిస్తోంది. ఇదంతా అక్కడున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ గమనిస్తున్నాడు. ఆయన అక్కడకు వెళ్లాగానే.. ‘‘సర్.. నా కారును ఆమె స్కూటీతో ఢీకొట్టింది. విషయం మా నాన్నకు తెలిస్తే నాకు ఎప్పటికీ కారు ఇవ్వరు’’ అని యువకుడు వాపోయాడు.
ఈ వార్తను కూడా చదవండి: కాంగ్రెస్‌లో అసమ్మతి గళం
‘ఫిర్యాదు రాసి ఇస్తాను. దాన్ని ఫొటో తీసుకొని మా నాన్నకు చూపిస్తాను’ అని పోలీసును బతిమాలాడాడు. కంప్లైంట్ రాసి ఇస్తాను అనగానే ఆ యువతి ప్లేట్ పిరాయించింది. ‘నేను ఢీకొట్టలేదు. అతడే నన్ను చాలా సేపటి నుంచి ఫాలో చేస్తూ వస్తున్నాడు. నేనే కంప్లైంట్ ఇస్తాను’ అని మాటమార్చడంతో కానిస్టేబుల్(Constable) అవాక్కయ్యాడు.
యువకుడు కారు ఆపిన తర్వాత వేగంగా వచ్చి నీవే ఢీకొట్టడం తాను చూశానని క్లాస్ తీసుకొని ఆమెను అక్కడి నుంచి పంపించేశాడు. తర్వాత యువకుడి తండ్రితో కానిస్టేబుల్ ఫోన్‌లో మాట్లాడి ‘మీ అబ్బాయి తప్పేమీ లేదు. ఓ యువతి వేగంగా వచ్చి కారును ఢీ కొట్టింది. నేనే సాక్ష్యం. ఈ విషయం మీకు చెప్పడానికి మీ అబ్బాయి బాధపడుతున్నాడు’ అని కానిస్టేబుల్ చెప్పడం గమనార్హం.
ఈవార్తను కూడా చదవండి: Prasad Behra: షూటింగ్‌లో నటితో అసభ్య ప్రవర్తన
ఈవార్తను కూడా చదవండి: పదేళ్లు బీఆర్ఎస్ విధ్వంసం చేసింది: కోమటిరెడ్డి
ఈవార్తను కూడా చదవండి: CM Revanth: ఆ ఇద్దరు కలిసి దేశ పరువు తీశారు
ఈవార్తను కూడా చదవండి: నాపై ఇలాంటి ఆరోపణలు సిగ్గుచేటు..
Read Latest Telangana News and National News