Share News

Hyderabad: హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల సేవలు

ABN , Publish Date - Nov 16 , 2024 | 08:49 AM

నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల నియంత్రణ విధులు నిర్వహించేందుకు ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. గతంలో నిర్ణయించిన విధంగా తొలిదశలో రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వీరిని నియమించాలని సూచించారు.

Hyderabad: హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల సేవలు

- త్వరలో ట్రాఫిక్‌ నియంత్రణ విధుల్లోకి..

- ప్రయోగాత్మక అమలుకు కసరత్తు

హైదరాబాద్‌ సిటీ: నగరంలో ట్రాఫిక్‌ ఇబ్బందులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో వాహనాల నియంత్రణ విధులు నిర్వహించేందుకు ట్రాన్స్‌జెండర్లను నియమించడంపై దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) అధికారులను ఆదేశించారు. గతంలో నిర్ణయించిన విధంగా తొలిదశలో రద్దీ ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో వీరిని నియమించాలని సూచించారు. సిగ్నల్‌ జంపింగ్‌, ఓవర్‌స్పీడ్‌, రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌ వంటి ట్రాఫిక్‌ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోంగార్డుల తరహాలో ట్రాన్స్‌జెండర్ల సేవలు వినియోగించుకోవాలని సూచించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఎన్‌ఎంజీ వ్యాగన్లలో ఎలక్ట్రిక్‌ ఆటోల రవాణా..


నగరంలో నిర్వహించే ట్రాఫిక్‌ ఉల్లంఘనల స్పెషల్‌డ్రైవ్‌, డ్రంకెన్‌ డ్రైవ్‌లోనూ వారి సేవలను వినియోగించుకోవాలని పేర్కొన్నారు. వారికి హోంగార్డుల తరహాలో జీతభత్యాలను సమకూర్చేలా విధివిధానాలు రూపొందించాలని, ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను రూపొందించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సీఎం పోలీసు అధికారులను ఆదేశించారు.


అధికారుల కసరత్తు

ట్రాన్స్‌జెండర్లను ట్రాఫిక్‌ విధుల్లోకి తీసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలపై పోలీసు ఉన్నతాధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది. వారు ఎలాంటి విధులు నిర్వహించాలి? నియమ నిబంధనలు ఏమిటి ? జీతభత్యాలు, ట్రాఫిక్‌ విధుల్లో వారి ప్రమేయం ఎంత మేరకు ఉండాలి? విద్యార్హతలు, శిక్షణ, ఇతర అంశాలపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు.


నగరంలో మొత్తం ఎంతమంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు ? వారిని ఎంపిక చేయడానికి ఎలాంటి అర్హతలను పరిగణనలోకి తీసుకోవాలి? ముందుగా పైలట్‌ ప్రాజెక్టుగా ఎంతమందిని తీసుకొని ట్రాఫిక్‌లో శిక్షణ ఇవ్వాలి? ఇలా అనేక అంశాలపై పోలీసులు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. అన్ని కోణాల్లో సమాలోచనలు చేసి, నియమనిబంధనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక పంపాలని అభిప్రాయపడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గ్రేటర్‌ పరిధిలో 3 వేల మంది వరకు ట్రాన్స్‌జెండర్లు ఉన్నట్లు పోలీసులు అంచనా వేస్తున్నారు. మార్గదర్శకాలు రూపొందించిన తర్వాత ప్రత్యేక నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలిసింది.


ఈవార్తను కూడా చదవండి: KTR: రేవంత్‌ ఓ రాబందు..

ఈవార్తను కూడా చదవండి: అయ్యప్ప భక్తుల కోసం మరో 4 ప్రత్యేక రైళ్లు

ఈవార్తను కూడా చదవండి: తగ్గిన ధరలకు బ్రేక్.. మళ్లీ పెరిగిన పుత్తడి రేట్లు

ఈవార్తను కూడా చదవండి: Treatment: మా అమ్మాయికి చికిత్స చేయించండి

Read Latest Telangana News and National News

Updated Date - Nov 16 , 2024 | 08:50 AM