Hyderabad: అమ్మో.. ఔటర్ రింగ్‌రోడ్డు..
ABN , Publish Date - Oct 17 , 2024 | 08:33 AM
మహానగరానికి మణిహారంగా భావించే ఔటర్ రింగ్‌రోడ్డు(Outer Ring Road) నిర్వహణ లేక అధ్వానంగా మారుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో గుంతలు పడి కంకర తేలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా 3, 4 లేన్లు కొన్నిచోట్ల గుంతలమయంగా మారాయి.
- గుంతలమయంగా 3,4 వరుసలు
- పెద్ద అంబర్‌పేట నుంచి పెద్ద గోల్కొండ వరకు ఇదే సీన్
- ఆ వరుసల్లో వెళ్లే భారీ వాహనదారులకు అవస్థలు
- రాళ్లు తేలి, గోతులు ఏర్పడడంతో పక్క లేన్లలోకి రాక
- ఫలితంగా తగ్గుతున్న వాహనాల వేగం
- 1, 2 లేన్లలోనూ పలుచోట్ల అధ్వానం
హైదరాబాద్ సిటీ: మహానగరానికి మణిహారంగా భావించే ఔటర్ రింగ్‌రోడ్డు(Outer Ring Road) నిర్వహణ లేక అధ్వానంగా మారుతోంది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆయా ప్రాంతాల్లో గుంతలు పడి కంకర తేలడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ప్రధానంగా 3, 4 లేన్లు కొన్నిచోట్ల గుంతలమయంగా మారాయి. ఆ వరుసల్లో ప్రయాణించాల్సిన భారీ వాహనాలు 1,2 లేన్లలోకి వస్తుండడంతో ప్రమాదాలకు ఆస్కారం ఏర్పడుతోంది. వాస్తవానికి ఈ రెండు లేన్లు వేగంగా ప్రయాణించేందుకు ఉద్దేశించినవి. పలు ప్రాంతాల్లో ఒకటి, రెండు లేన్లలో రాళ్లు తేలి, గుంతలు ఏర్పడడంతో ప్రయాణం నరకప్రాయం అవుతోంది.
ఈ వార్తను కూడా చదవండి: MBBS : పోయేది ఎక్కువ.. వచ్చేది తక్కువ
ఇష్టానుసారంగా మరమ్మతులు
హైదరాబాద్ చుట్టూ 158 కి.మీ. మేర గరిష్ఠంగా 120 కి.మీ. వేగంతో వెళ్లేలా ఆరు వరుసల్లో రింగ్‌రోడ్డును నిర్మించారు. 1, 2 లేన్లలో మాత్రమే ఆ వేగ పరిమితికి అనుమతించారు. అంత వేగంలోనూ కుదుపులు లేకుండా ప్రయాణించేలా రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు ఔటర్ 3,4 లేన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. పెద్ద అంబర్‌పేట(Amberpet) నుంచి శంషాబాద్ వైపు వచ్చే మార్గంలో పెద్ద గోల్కొండ వరకు దాదాపు ఇదే పరిస్థితి నెలకొన్నది. బొంగుళూరు, తుక్కుగూడ ఇంటర్‌చేంజ్‌ల మధ్య మూడు, నాలుగు లేన్లలో గుంతలు ఏర్పడగా, వాటిని సక్రమంగా పూడ్చకపోవడంతో ఎగుడు దిగుడుగా మారి వాహనాలు కుదుపునకు గురవుతున్నాయి.
రీ కార్పెటింగ్‌తోనే సమస్యకు పరిష్కారం
ఔటర్‌పై గుంతలు ఏర్పడిన ప్రాంతాల్లో నాలుగు మూలలా తవ్వేసి.. అందులో బీటీ నింపాల్సి ఉంటుంది. ఆ బీటీ కూడా నిర్ణీత ఉష్ణోగ్రతలో పోసి ప్రత్యేక యంత్రంతో గట్టిగా కుదించాలి. వరుసగా గుంతలు ఏర్పడిన ప్రాంతాల్లో బీటీని ఒక పొర దాకా పూర్తిగా తొలగించాల్సి ఉంటుంది. అంతే లేయర్‌తో బీటీని పునరుద్ధరణ చేసేందుకు రీ కార్పెటింగ్ పనులు చేపట్టాల్సి ఉన్నదని హెచ్‌ఎండీఏ(HMDA)కు చెందిన ఓ ఇంజనీర్ వ్యాఖ్యానించారు.
భారీ వాహనాల తీరుతో ఆందోళన
ఔటర్‌పైకి వచ్చే భారీ వాహనాలు 3,4 లేన్లలో గరిష్ఠంగా 80 కి.మీ. వేగంతో ప్రయాణిస్తాయి. ఆ లేన్లలో రోడ్డు దెబ్బతినడంతో చేసేది లేక 1, 2 లేన్లలోకి వచ్చేస్తున్నాయి. ఈ లేన్లలో గరిష్ఠ వేగ పరిమితి 120 కి.మీ. దీంతో ఒకటి, రెండు లేన్లలో వేగంగా వెళ్లే వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆ లేన్లలోకి నెమ్మదిగా వెళ్లే భారీ వాహనాలు రావడంతో ఆందోళన చెందుతున్నారు.
ఇదికూడా చదవండి: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...
ఇదికూడా చదవండి: హైడ్రాకు జీహెచ్‌ఎంసీ, మునిసిపల్ అధికారాల బదిలీ
ఇదికూడా చదవండి: Revenue System: మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ!
ఇదికూడా చదవండి: బతుకమ్మరోజు ఆడబిడ్డలకు ఒక్కచీరా ఇవ్వలేదు
Read Latest Telangana News and National News