Hyderabad: తీరుమారని పోలీస్.. ఆస్తి తగాదా తీరుస్తానంటూ భారీగానే..
ABN , Publish Date - Oct 24 , 2024 | 07:37 AM
అన్నదమ్ముల మధ్య కోట్లాది రూపాయల ఆస్తి వివాదంలో ఓ ఏసీపీ(ACP) తలదూర్చి రూ.5 లక్షలు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర కమిషనరేట్(City Commissionerate)లోని వెస్ట్‌జోన్ పరిధి వీఐపీ డివిజన్‌లో పనిచేస్తున్న సదరు ఏసీపీకి మంచి విందు ఇవ్వడంతోపాటు అడ్వాన్స్‌గా కొంత ముట్టజెప్పినట్లు తెలిసింది.
- ఆస్తి తగాదా తీరుస్తానని ఏసీపీ భరోసా
- అడ్వాన్స్‌గా రూ.5లక్షలు.. ఫామ్‌హౌస్‌లో విందు !
హైదరాబాద్: అన్నదమ్ముల మధ్య కోట్లాది రూపాయల ఆస్తి వివాదంలో ఓ ఏసీపీ(ACP) తలదూర్చి రూ.5 లక్షలు పుచ్చుకున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగర కమిషనరేట్(City Commissionerate)లోని వెస్ట్‌జోన్ పరిధి వీఐపీ డివిజన్‌లో పనిచేస్తున్న సదరు ఏసీపీకి మంచి విందు ఇవ్వడంతోపాటు అడ్వాన్స్‌గా కొంత ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ వ్యవహారం తెలిసిన డీసీపీ తీవ్రస్థాయిలో మందలించినట్టు సమాచారం. వెస్ట్‌జోన్ పరిధిలోని ఇద్దరు అన్నదమ్ములు నగరంలో వ్యాపారం చేస్తూ ఆర్థికంగా బాగా స్థిరపడ్డారు.
ఈ వార్తను కూడా చదవండి: Harish Rao: రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడుతున్నారు
ఖరీదైన ప్రాంతంలో వీరికి తండ్రి తరఫున వచ్చిన కోట్ల రూపాయల విలువ చేసే ఓ ఇల్లు ఉంది. దీన్ని పంచుకునే విషయంలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఎలాగైనా ఇంటిపై పైచేయి సాధించాలని ప్రయత్నాలు ఆరంభించారు. పలుకుబడి, డబ్బు ఉపయోగించి ఇంటిని తమ వశం చేసుకోవాలని పథకాలు వేసుకున్నారు. రాజకీయ నేతలను సంప్రదించినా లాభం లేకపోవడంతో ఒకరిపై ఒకరు కేసు పెట్టుకున్నారు.
సివిల్ వివాదం కావడంతో మీరే తేల్చుకోండని పోలీసులు సూచించారు.వివాదం పశ్చిమ మండలంలో పనిచేస్తున్న ఏసీపీ వద్దకు చేరింది. అన్నదమ్ముల్లో ఒకరు ఏసీపీకి దగ్గరై శంకర్‌పల్లి(Shankarpally)లోని ఫామ్‌హౌ్‌సలో విందు ఇవ్వడంతోపాటు తనకు అనుకూలంగా చేసేందుకు రూ. 5లక్షలు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. విషయం బయటకు పొక్కడంతో డబ్బు ఇచ్చిన వ్యక్తి కోసం స్పెషల్ బ్రాంచ్ రంగంలోకి దిగింది.
ఇదికూడా చదవండి: చెప్పినట్లుగానే దరణిని మారుస్తున్నాం: మంత్రి పొంగులేటి
ఇదికూడా చదవండి: తెలంగాణ ఎమ్మెల్యేల సిఫారసు లేఖలనూ తిరుమలలో అనుమతించాలి
ఇదికూడా చదవండి: KTR: రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు
ఇదికూడా చదవండి: Bandi Sanjay: భయపెట్టాలని చూస్తే భయపడతామా?
Read Latest Telangana News and National News