Hyderabad: రేవంత్ సర్కార్‌పై యుద్ధం తప్పదు..
ABN , Publish Date - Nov 08 , 2024 | 10:58 AM
సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్‌పై యుద్ధం తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ప్రకటించారు.
హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పునిచ్చినా ఎస్సీ వర్గీకరణను అమలు చేయకుండా ఉద్యోగ నియామకాలు చేస్తున్న రేవంత్‌రెడ్డి(Revanth Reddy) సర్కార్‌పై యుద్ధం తప్పదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ(Mandakrishna Madiga) ప్రకటించారు. ఖైరతాబాద్ మోడ్రన్ ఫంక్షన్‌హాల్‌లో హైదరాబాద్ జిల్లా మాదిగల ధర్మయుద్ధ సదస్సు ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు టివి నరసింహమాదిగ అధ్యక్షతన గురువారం జరిగింది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: భరించలేకపోతున్నాం.. సెలవులు ఇవ్వండి
హాజరైన మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ(Congress Party)లో కేంద్రంలో, రాష్ట్రంలో మాలల ఆధిపత్యం నడుస్తోందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఎస్సీ వర్గీకరణ చేయాలని ఉన్నా, పార్టీలోని కొందరు అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఎస్సీ వర్గీకరణను అమలుపరచుకునేందుకు మరో యుద్ధానికి మాదిగలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సదస్సులో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవిందు నరేష్ మాదిగ, నగరంలోని ఎమ్మార్పీఎస్, ఎంఎ్‌సపి, అనుబంధ సంఘాల ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఈవార్తను కూడా చదవండి: పశ్చిమ బెంగాల్ నుంచి నగరానికి హెరాయిన్.. ఐటీ కారిడార్‌లో విక్రయం
ఈవార్తను కూడా చదవండి: నీళ్ల బకెట్లో పడి ఏడాదిన్నర చిన్నారి మృతి
ఈవార్తను కూడా చదవండి: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు దివాలా: కిషన్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: వద్దొద్దంటున్నా.. మళ్లీ ఆర్‌ఎంసీ!
Read Latest Telangana News and National News