Share News

Hyderabad: శాంపిల్స్‌ మేమిచ్చాం.. మీరివ్వండి

ABN , Publish Date - Oct 31 , 2024 | 09:49 AM

డ్రగ్‌ టెస్ట్‌కు తాము శాంపిల్స్‌ ఇచ్చామని, దమ్ము, ధైర్యముంటే శాంపిల్స్‌ ఇవ్వాలని ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌(MP Anilkumar Yadav and MLC Balmur Venkat) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు సవాల్‌ విసిరారు. బుధవారం హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో డ్రగ్స్‌ నిజ నిర్ధారణ కోసం యూరిన్‌, డీఓఏ డ్రగ్‌ ప్యానల్‌ శాంపిల్స్‌ ను వారు ఇచ్చారు.

Hyderabad: శాంపిల్స్‌ మేమిచ్చాం.. మీరివ్వండి

- బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ఎంపీ అనిల్‌, ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌ సవాల్‌

హైదరాబాద్‌ సిటీ: డ్రగ్‌ టెస్ట్‌కు తాము శాంపిల్స్‌ ఇచ్చామని, దమ్ము, ధైర్యముంటే శాంపిల్స్‌ ఇవ్వాలని ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఎమ్మెల్సీ బల్మూర్‌ వెంకట్‌(MP Anilkumar Yadav and MLC Balmur Venkat) బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు సవాల్‌ విసిరారు. బుధవారం హైదర్‌గూడ అపోలో ఆస్పత్రిలో డ్రగ్స్‌ నిజ నిర్ధారణ కోసం యూరిన్‌, డీఓఏ డ్రగ్‌ ప్యానల్‌ శాంపిల్స్‌ ను వారు ఇచ్చారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇతరులు డ్రగ్స్‌ టెస్ట్‌ కోసం ఏఐజీ ఆస్పత్రికి వస్తానని, సలీం ఫెకూ రాలేదని విమర్శించారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వెనుక నుంచి ఢీకొట్టి 500 మీటర్లు ఈడ్చుకెళ్లి..


కేటీఆర్‌ బామ్మర్ది జరిపిన విందులో ఒకరి కి పాజిటివ్‌ వస్తే బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఎందుకు ఉలిక్కిపడుతున్నారని ప్రశ్నించారు. ఇటీవల కేటీఆర్‌, కౌశిక్‌(KTR, Kaushik) డ్రగ్స్‌ తీసుకున్నారేమోనని, అందుకే టెస్ట్‌ శాంపిల్స్‌ ఇచ్చేందుకు రావడం లేదన్నారు. రాజకీయాల్లో బాధ్యతల గల పదవిలో ఉన్నపుడు ఆరోపణలు వస్తే నిరూపించుకోవాలన్నారు.


హైదరాబాద్‌(Hyderabad) మహానగరాన్ని డ్రగ్స్‌ ఫ్రీ సిటీగా మార్చేందుకు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) ముందుకు వెళ్తుంటే.. బీఆర్‌ఎస్‌ నాయకులు ఆ వాతావరణం లేకుండా చేయాలని చూస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్‌(BRS) నాయకులు వారి మిత్రులతో కలిసి హైదరాబాద్‌ను డ్రగ్స్‌ సిటీగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. కౌశిక్‌ ఇకనైనా ఇష్టం వచ్చిన్నట్లు మాట్లాడొద్దని, నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు.


ఈవార్తను కూడా చదవండి: CM Revanth Reddy: తెలంగాణ నుంచే మోదీపై యుద్ధం!

ఈవార్తను కూడా చదవండి: బీఆర్‌ఎస్‌ వల్లే విద్యుత్‌ చార్జీల పెంపుపై వెనక్కి

ఈవార్తను కూడా చదవండి: Ponguleti :నిరుపేదలకు అన్యాయం జరిగితే ఊరుకోం

ఈవార్తను కూడా చదవండి: Kaushik Reddy: నా పంచాయితీ అంతా సీఎం రేవంత్‌తోనే!

Read Latest Telangana News and National News

Updated Date - Oct 31 , 2024 | 09:49 AM