Share News

Hyderabad: హైడ్రా బాధితులకు అండగా ఉంటాం..

ABN , Publish Date - Oct 17 , 2024 | 11:41 AM

హైడ్రా బాధితులకు అండగా నిలిచేందుకే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) పార్టీ భవన్‌లో నిర్వహించిన సమావేశానికి ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(Uppal MLA Bandari Lakshmareddy)తోపాటు మల్కాజిగిరి లోక్‌సభ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.

Hyderabad: హైడ్రా బాధితులకు అండగా ఉంటాం..

హైదరాబాద్: హైడ్రా బాధితులకు అండగా నిలిచేందుకే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌(KTR) పార్టీ భవన్‌లో నిర్వహించిన సమావేశానికి ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(Uppal MLA Bandari Lakshmareddy)తోపాటు మల్కాజిగిరి లోక్‌సభ బీఆర్‌ఎస్‌ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సమావేశంలో మూసీ ప్రక్షాళనపై న్యాయపరంగా బాధితులకు అండగా నిలిచే అంశంపై నగర ఎమ్మెల్యేలతో కేటీఆర్‌ చర్చించారు. పార్టీ భవన్‌కు వచ్చిన హైడ్రా బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి(MLA Lakshmareddy) భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మల్కాజిగిరి లోక్‌సభ ఇన్‌చార్జి రాగిడి లక్ష్మారెడ్డి కేటీఆర్‌కు పలు సూచనలు చేశారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: ఆ ఏరియాల్లో.. నిత్యం ట్రాఫిక్‌జామే..


.....................................................................

ఈ వార్తను కూడా చదవండి:

......................................................................

Hyderabad: ఊడ్చేందుకు పదిరెట్ల చార్జీలు

- రూపాయి పనికి రూ.10 చెల్లింపు

- పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్యం పేరిట ప్రజాధనం లూటీ

- అయినా వాళ్లనే కొనసాగించాలని పట్టు

- లేఖ రాసిన ఎంఐఎం ఎమ్మెల్యే

- గత ప్రభుత్వంలో నిర్ణయం.. ఇప్పటికీ వాళ్లదే హవా

మనం ఏదైనా పని చేయించాలంటే అంచనా (ఎస్టిమేషన్‌) వేస్తాం. అందుకనుగుణంగా చేసిన పనికి డబ్బులు చెల్లిస్తాం. కానీ జీహెచ్‌ఎంసీలో అలా కాదు. రూపాయి పనిచేస్తే రూ.10 చెల్లిస్తున్నారు. దర్జాగా ప్రజాధనాన్ని నీళ్లలా ఖర్చు చేస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో నియామకమైన ప్రైవేటు సంస్థలు ఇప్పటికీ హవా కొనసాగిస్తూ మరోమారు కాంట్రాక్టు పొడిగింపునకు ప్రయత్నాలు చేస్తున్నాయి. తాజాగా ఓ సంస్థ కాంట్రాక్టు గడువు పొడిగింపునకు ఓ ఎమ్మెల్యే సిఫార్సు చేయడం గమనార్హం.


హైదరాబాద్‌ సిటీ: మహానగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ)లో పారిశుధ్యం పేరిట ప్రైవేటు సంస్థలు దర్జాగా ఖజానాను ఊడ్చేస్తున్నాయి. రూపాయి పనికి సుమారు రూ.10 వసూలు చేస్తూ కోట్లాది రూపాయలను జేబుల్లో వేసుకుంటున్నాయి. గత ప్రభుత్వ హయాంలో ఉన్నతస్థాయి ఆదేశాలతో కాంట్రాక్టులు దక్కించుకున్న సంస్థలు.. ప్రస్తుత కాంగ్రెస్‌ హయాంలోనూ అదే హవా కొనసాగిస్తుండడం విశేషం. అధిక పైసలకు రుచిమరిగిన ఏజెన్సీలు.. కాంట్రాక్టు పొడిగింపునకు ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొస్తున్నాయి. ఇందుకు గ్రేటర్‌లోని కొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు సహకరిస్తుండడం గమనార్హం. తాజాగా ఓ సంస్థ కాంట్రాక్టు గడువు పొడిగింపునకు సిఫార్సు చేస్తూ ఓ ఎమ్మెల్యే జీహెచ్‌ఎంసీ కమిషనర్‌, అదనపు కమిషనర్లకు లేఖ రాశారు.

city7.jpg


మెరుగైన పారిశుధ్యం కోసమని..

మెరుగైన నిర్వహణ కోసం నగరంలోని పర్యాటక ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించారు. సాధారణంగా కిలోమీటరు మేర రహదారిపై పారిశుధ్య నిర్వహణకు జీహెచ్‌ఎంసీ ఏటా రూ.40 వేల వరకు ఖర్చు చేస్తోంది. అదే ప్రైవేట్‌ ఏజెన్సీకి మాత్రం రూ.3.12 లక్షల చొప్పున చెల్లిస్తోంది. రెండువిడతల్లో పనిచేసే కార్మికులు ఎప్పటికప్పుడు ఆయా ప్రాంతాల్లో చెత్తాచెదారాన్ని తొలగిస్తారని, అందుకే అదనపు వ్యయం అని అధికారులు చెబుతున్నారు. అలా చూసినా కిలోమీటరుకు రూ.80 వేల నుంచి రూ.లక్ష వరకు కావాలి. కానీ జీహెచ్‌ఎంసీ మాత్రం ఆ సంస్థలకు కిలోమీటరుకు రూ.3.12 లక్షలను అప్పనంగా చెల్లిస్తోంది.


ఎమ్మెల్యే సిఫారసు..

దేశ, విదేశీ పర్యాటకులు సందర్శించే నగరంలోని చార్మినార్‌, మక్కామసీదు, గోల్కొండ కోట, ఫలక్‌నుమా ప్యాలెస్‌, సాలార్‌జంగ్‌ మ్యూజియం, బాపూఘాట్‌, కుతుబ్‌షాహీ టూంబ్స్‌, పైగా టూంబ్స్‌, నాంపల్లి పబ్లిక్‌గార్డెన్‌(Nampally Public Garden), అసెంబ్లీ, బిర్లా మందిర్‌ తదితర ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణను గత ప్రభుత్వం ప్రైవేట్‌ సంస్థలకు అప్పగించింది. ఆ ప్రాంతాల్లో అపరిశుభ్రత ఉంటే నగర పర్యాటకంపై ప్రభావం చూపుతుందన్న ఆలోచనతో నిర్ణయం తీసుకున్నారు.


9 ప్రాంతాల్లోని 73.75 కి.మీల కారిడార్లలో పారిశుధ్య నిర్వహణ బాధ్యతలను ఎక్సోరా కార్పొరేట్‌ సర్వీసెస్‌, లా మెక్‌లీన్‌ సంస్థలకు అప్పగించారు. ఇందుకోసం నెలకు రూ.2.30 కోట్ల చొప్పున ఏడాదికి సుమారు రూ.27 కోట్ల నుంచి రూ.28 కోట్లు బల్దియా చెల్లిస్తోంది. బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వ హయాంలో ఓ కీలక మంత్రి వద్ద పనిచేసే అధికారి సూచనల మేరకు ఏజెన్సీలను ఎంపిక చేశారు. గడువు ముగిసినా గతంలోనే పలుమార్లు కాలవ్యవధి పొడిగించారు. ప్రస్తుతం సెప్టెంబరు నుంచి ఫిబ్రవరి 2025 వరకు మరోమారు గడువు పొడిగించాలని ఎక్సోరా సంస్థ జీహెచ్‌ఎంసీని కోరింది.


ఈ వినతిని పారిశుధ్య నిర్వహణ విభాగం పక్కనపెట్టి పొడిగింపు అవసరం లేదని ఉన్నతాధికారులకు నివేదించింది. దీంతో అలవాటైన పద్ధతిలో ప్రజాప్రతినిధులను సదరు సంస్థ రంగంలోకి దింపింది. ఎక్సోరా సంస్థ గడువు పొడిగించాలని ఎంఐఎం ఎమ్మెల్యే ఒకరు సిఫార్సు లేఖ ఇచ్చారు. గ్రేటర్‌లోని ఓ కీలక ప్రజాప్రతినిధి కూడా పారిశుధ్య నిర్వహణ ప్రైవేట్‌ సంస్థల ఆధీనంలో ఉండేలా, లూ-కెఫేలపై ఈగ వాలకుండా చూసుకుంటారని ప్రచారం జరుగుతోంది.


ఇదికూడా చదవండి: పోలీసుల అదుపులో మావోయిస్టు అగ్రనేత సుజాత...

ఇదికూడా చదవండి: హైడ్రాకు జీహెచ్‌ఎంసీ, మునిసిపల్‌ అధికారాల బదిలీ

ఇదికూడా చదవండి: Revenue System: మళ్లీ గ్రామ రెవెన్యూ వ్యవస్థ!

ఇదికూడా చదవండి: బతుకమ్మరోజు ఆడబిడ్డలకు ఒక్కచీరా ఇవ్వలేదు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 17 , 2024 | 11:42 AM