Hyderabad: మొన్న మయోనైజ్.. నేడు మోమోస్
ABN , Publish Date - Oct 29 , 2024 | 07:56 AM
మయోనైజ్(Mayonnaise) తినడంతో అస్వస్థతకు గురైన ఘటన మరువకముందే మోమోల కారణంగా ఓ మహిళ మరణించడం ఆహారప్రియులకు షాక్ కొట్టినట్లయ్యింది. ఈ ఘటనలో మరో 50 మందికిపైగా అనారోగ్యంతో పలు ఆస్పత్రుల్లో చేరారు. దీంతో నగరంలో ఒక్కసారిగా మోమోలపై చర్చ మొదలైంది.
- ఆహార ప్రియులను కలవరపెడుతున్న ఘటనలు
- ప్రత్యేకంగా నగరంలో మోమోస్ ఔట్‌లెట్లు
- రోజూ తింటే క్యాన్సర్, గుండె వ్యాధులు వచ్చే చాన్స్
హైదరాబాద్ సిటీ: మయోనైజ్(Mayonnaise) తినడంతో అస్వస్థతకు గురైన ఘటన మరువకముందే మోమోల కారణంగా ఓ మహిళ మరణించడం ఆహారప్రియులకు షాక్ కొట్టినట్లయ్యింది. ఈ ఘటనలో మరో 50 మందికిపైగా అనారోగ్యంతో పలు ఆస్పత్రుల్లో చేరారు. దీంతో నగరంలో ఒక్కసారిగా మోమోలపై చర్చ మొదలైంది. మోమోలు ఆరోగ్యానికి మంచివా? కావా? అని మొదలుపెట్టి, అసలు మోమోలను ఎలా తయారు చేస్తున్నారు? వంటి అంశాలనూ సామాజిక మాధ్యమాల వేదికగా చర్చిస్తున్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: డిసెంబర్‌లోపు జూపార్క్ ఫ్లైఓవర్ రెడీ
టిబెట్‌లో మొదలై అటు ఉత్తరభారతంతోపాటు దక్షిణాది భోజనప్రియుల మదిలోనూ ప్రత్యేక స్ధానం సంపాదించుకున్న మోమో.. నగరవాసుల ఆహార మెనూలో ప్రత్యేకమైంది. ఐటీ కారిడార్ నుంచి అధికంగా మోమోలకు ఈవినింగ్ స్నాక్ టైమ్‌లో ఆర్డర్లు వస్తున్నాయని ఫుడ్ డెలివరీ యాప్‌ల అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. మోమోల కోసమే ప్రత్యేకంగా ఔట్‌లెట్లు వెలియడం నగరంలో కనిపిస్తున్న నయా ధోరణికి నిదర్శనం. ఆవిరిపై ఉడికించడం లేదా ఫ్రై డంప్లింగ్స్ రూపంలో లభించే ఈ మోమోలో విభిన్న రుచులు ఉన్నాయి.
ఆవిరిపై ఉడికి.. వైవిధ్యతనూ చూపి
టిబెట్ సంప్రదాయ అల్పాహారంలో మోమో ఓ భాగమైనప్పటికీ.. నేపాల్, చైనాలో ఎక్కువగా కనిపించే స్నాక్ ఐటెమ్ ఇది. మైదాపిండిలో కూరగాయలు లేదంటే మాంసాహార పదార్థాలను ఉంచి ఆవిరిలో ఉడికించే డప్లింగ్స్ ఇవి. సంప్రదాయంగా అయితే ఆవిరి మీదనే ఈ మోమోలను ఉడికిస్తారు. కానీ, ఇటీవల కాలంలో వేయించిన రకాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. వాస్తవానికి దశాబ్దకాలంగా మోమోలకు స్ట్రీట్‌ఫుడ్‌లో డిమాండ్ విపరీతంగా పెరిగింది. తక్కువ ధర, ఆవిరిపై ఉడికించడం, కూరగాయలు లోపల ఉండటం వల్ల అల్పాహారంగా కాలేజీ విద్యార్థులు, ఐటీ ఉద్యోగులు తినడానికి ఇష్టపడుతున్నారు. ఇందులో మైదాతోపాటు గోధుమపిండి, పనసపొట్టు పొడి వంటివి కూడా వాడుతున్నారు.
నిల్వ పదార్థాలతోనే..
మోమోలకు ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతుండటంతో వీటి కోసమే ప్రత్యేకంగా స్టాళ్లు ఏర్పాటయ్యాయి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారే కాకుండా నగరవాసులూ వీటిని ఏర్పాటు చేస్తున్నారు. హోటళ్లు, రెస్టారెంట్‌లలో సైతం వీటిని ప్రత్యేకంగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. సోమాజిగూడ, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్(Somajiguda, Hitechcity, Banjara Hills, Jubilee Hills).. చాలా ప్రాంతాల్లో స్ట్రీట్‌ఫుడ్‌గా లభిస్తున్నాయి. సాధారణంగా స్ట్రీట్లలో 6 మోమోలకు రూ.50-100 వసూలు చేస్తుంటే, కొన్ని ప్రాచుర్యం పొందిన రెస్టారెంట్లలో రూ.200-400 వరకు విక్రయిస్తున్నారు.
నిజానికి మోమోల వల్ల ఆరోగ్య ప్రయోజనాలున్నాయని, అపరిశుభ్ర వాతావరణం, వాటి ఫిల్లింగ్‌లో నిల్వ పదార్థాలు జోడించడం వల్ల సమస్యలు వస్తాయని చెఫ్ శ్రీనివాస్ చెప్పారు. మోమోలను అప్పుడప్పుడు తింటే పెద్దగా ఇబ్బంది రాకపోవచ్చు కానీ, రోజూ తింటే మాత్రం ప్రమాదమేనని జనరల్ ఫిజీషియన్ కుమార్ అభిప్రాయపడ్డారు. ఇందులో వాడే ఎంఎ్‌సజీ (చైనా ఉప్పు అని కూడా అంటారు) వల్ల క్యాన్సర్, గుండె జబ్బుల బారిన పడేలా చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. కాగా, గతంలో ఈ మోమోలను నిషేధించాలని ఢిల్లీలో ఉద్యమం కూడా జరగడం గమనార్హం.
ఈవార్తను కూడా చదవండి: Food Poisoning: వామ్మో.. మోమోస్!
ఈవార్తను కూడా చదవండి: KTR: బుచ్చమ్మది.. రేవంత్ చేసిన హత్య
ఈవార్తను కూడా చదవండి: Madhuranagar: ‘ధరణి’తో మా ప్లాట్ల కబ్జా
ఈవార్తను కూడా చదవండి: Kaleshwaram Project: మేడిగడ్డతో ముంపు
Read Latest Telangana News and National News