Share News

Hyderabad: డిసెంబర్‌లోపు జూపార్క్‌ ఫ్లైఓవర్‌ రెడీ

ABN , Publish Date - Oct 29 , 2024 | 07:19 AM

వానాకాలంలో నీళ్లు నిలిచే 141 ప్రాంతాల్లో ప్రధానంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 23 చోట్ల సంపుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌(Hyderabad District In-charge Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలంలోపు ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌లో భాగంగా నగరంలో వాటర్‌ లాగింగ్‌ పాయింట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Hyderabad: డిసెంబర్‌లోపు జూపార్క్‌ ఫ్లైఓవర్‌ రెడీ

- పెండింగ్‌ పనులు త్వరగా పూర్తి చేయండి

- 23 సంపుల నిర్మాణాలు వేగిరం కావాలి

- సమీక్షలో మంత్రి పొన్నం ప్రభాకర్‌ ఆదేశం

హైదరాబాద్‌ సిటీ: వానాకాలంలో నీళ్లు నిలిచే 141 ప్రాంతాల్లో ప్రధానంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న 23 చోట్ల సంపుల నిర్మాణ పనులు వేగవంతం చేయాలని హైదరాబాద్‌ జిల్లా ఇన్‌చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్‌(Hyderabad District In-charge Minister Ponnam Prabhakar) అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలంలోపు ప్లాన్‌ ఆఫ్‌ యాక్షన్‌లో భాగంగా నగరంలో వాటర్‌ లాగింగ్‌ పాయింట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ వార్తను కూడా చదవండి: ERC: గృహ విద్యుత్‌ చార్జీలు పెరగలే!

ABN ఛానల్ ఫాలో అవ్వండి

ఫ్లైఓవర్లు, నాలాల నిర్మాణాల పెండింగ్‌ పనులపై జీహెచ్‌ఎంసీ చీఫ్‌ ఇంజనీర్లు, ఇతర ఉన్నతాధికారులతో సోమవారం మంత్రి సచివాలయంలోని తన చాంబర్‌లో సమీక్ష నిర్వహించారు. నగరంలో రోజురోజుకు పెరుగుతున్న ట్రాఫిక్‌ ఇబ్బందులను అధిగమించేందుకు ఎస్‌ఆర్‌డీపీలో భాగంగా 48 ఫ్లైఓవర్లను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో ఆరు వంతెనలు, ఆర్‌ అండ్‌ బీ, హెచ్‌ఎండీఏకి చెందినవి కాగా, జీహెచ్‌ఎంసీకి చెందిన 36 పనులు ఇప్పటికే పూర్తయ్యాయని చీఫ్‌ ఇంజనీర్‌ అధికారులు మంత్రి పొన్నం ప్రభాకర్‌ దృష్టికి తీసుకొచ్చారు.


city1.jpg

ఎన్‌హెచ్‌లో భాగంగా నిర్మిస్తున్న అంబర్‌పేట ఫ్లైఓవర్‌, ఉప్పల్‌-నారపల్లి(Uppal-Narapalli) వంతెనల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఆరాంఘర్‌-జూపార్క్‌ ఫ్లైఓవర్‌ పనులు చివరిదశలో ఉండడంతో డిసెంబర్‌లోపు పూర్తిచేయాలని, పెండింగ్‌లో ఉన్న ఇతర నిర్మాణాలను వేగవంతం చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. రైల్వే నిర్మిస్తున్న ఆర్వోబీ, సబ్‌స్టేషన్లు తదితర పనులపై విద్యుత్‌ అధికారులతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.


నాలాలు, సీవరేజ్‌పై ఆరా

ఎస్‌ఎన్‌డీపీలో భాగంగా నాలాల విస్తరణ, పునరుద్ధరణ గురించి సమావేశంలో చర్చించారు. పెండింగ్‌లో ఉన్న నాలా పనులపై మంత్రి ఆరాతీశారు. కొత్త ఫ్లైఓవర్లు, నాలాల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించారు. జీహెచ్‌ఎంసీతోపాటు పరిసర ప్రాంత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో సమన్వయం చేసుకొని పెండింగ్‌ పనులు పూర్తిచేయాలని సూచించారు.


సీఆర్‌ఎంపీలో భాగంగా జీబ్రా క్రాసింగ్‌ లైన్‌, సైన్‌ బోర్డులు, ఇతర రోడ్డు మార్కింగ్‌లు ఎక్కడైనా పెండింగ్‌ పనులు ఉంటే పూర్తి చేయాలని, కొత్త రోడ్లు అవసరం ఉంటే ప్రతిపాదనలు సిద్ధం చేసి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావాలని సూచించారు. సమావేశంలో జీహెచ్‌ఎంసీ, ఎస్‌ఆర్‌డీపీ ప్రాజెక్ట్‌ చీఫ్‌ ఇంజనీర్‌ దేవానంద్‌, ఎస్‌ఎన్‌డీపీ చీఫ్‌ ఇంజనీర్‌ కోటేశ్వరరావు, చీఫ్‌ ఇంజనీర్‌ (నిర్వహణ) భాస్కర్‌రెడ్డి, ఆరు జోన్ల ఎస్‌సీలు తదితర అధికారులు పాల్గొన్నారు.


ఈవార్తను కూడా చదవండి: Food Poisoning: వామ్మో.. మోమోస్‌!

ఈవార్తను కూడా చదవండి: KTR: బుచ్చమ్మది.. రేవంత్‌ చేసిన హత్య

ఈవార్తను కూడా చదవండి: Madhuranagar: ‘ధరణి’తో మా ప్లాట్ల కబ్జా

ఈవార్తను కూడా చదవండి: Kaleshwaram Project: మేడిగడ్డతో ముంపు

Read Latest Telangana News and National News

Updated Date - Oct 29 , 2024 | 07:19 AM