Share News

TS News: మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మేనల్లుడికి 41 సీఆర్పీసీ నోటీసులు

ABN , Publish Date - Jan 08 , 2024 | 01:35 PM

Telangana: మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డికి కేపీ‌హెచ్‌బీ పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. అగ్రజ్‌రెడ్డి మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. విచారణకు సహకరించాల్సిందిగా అగ్రజ్‌రెడ్డికి పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు.

TS News: మాజీమంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి మేనల్లుడికి 41 సీఆర్పీసీ నోటీసులు

హైదరాబాద్, జనవరి 8: మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డికి కేపీ‌హెచ్‌బీ పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు. అగ్రజ్‌రెడ్డి మోతాదుకు మించి మద్యం సేవించినట్లు గుర్తించారు. విచారణకు సహకరించాల్సిందిగా అగ్రజ్‌రెడ్డికి పోలీసులు 41 సీఆర్పీసీ నోటీసులు జారీ చేశారు.

అసలేం జరిగిందంటే.. కేపీహెచ్‌బీ కాలనీ ఫోరo మాల్ సర్కిల్ వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. మద్యం మత్తులో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మేనల్లుడు అగ్రజ్ రెడ్డి హోండా సిటీ కారు.. ఓ ద్విచక్ర వాహనాన్ని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడ్డవారిని పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో కారులో నలుగురు వ్యక్తులు ఉన్నట్లు గుర్తించారు. గచ్చిబౌలిలో ఓ పబ్లో పార్టీ చేసుకొని తిరిగి జీడిమెట్ల వైపు వెళుతుండగా అగ్రజ్‌రెడ్డి ఈ ప్రమాదానికి పాల్పడ్డాడు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 08 , 2024 | 01:35 PM