Share News

Crime News: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

ABN , Publish Date - Dec 27 , 2024 | 09:35 AM

హైదరాబాద్: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. కానిస్టేబుల్ వేధింపులు భరించలేక రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య చేసుకుంది. తన మరణానికి కానిస్టేబుల్ అనిల్ అతని భార్య కారణం అంటూ సెల్ఫీ వీడియోలో పేర్కొంది. హబ్సిగూడలోని ఐఐసీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా మృతురాలు దీప్తి పనిచేస్తోంది.

Crime News: నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

హైదరాబాద్: నాచారం (Nacharam) పోలీస్ స్టేషన్ (police station) పరిధిలో దారుణం జరిగింది. కానిస్టేబుల్ వేధింపులు భరించలేక రీసెర్చ్ స్కాలర్ ఆత్మహత్య (Suicide) చేసుకుంది. తన మరణానికి కానిస్టేబుల్ అనిల్ అతని భార్య కారణం అంటూ సెల్ఫీ వీడియో (Selfie video)లో పేర్కొంది. హబ్సిగూడలోని ఐఐసీటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్‌గా మృతురాలు దీప్తి పనిచేస్తోంది. అదే ఐఐసీటీలో దీప్తి తండ్రి సంగీత్ రావు పనిచేసి పదవీ విరమణ పొందారు. ఈ క్రమంలో ఐఐసీటీలో అనిల్ భార్యకు ఉద్యోగం ఇప్పిస్తానని కానిస్టేబుల్ వద్ద సంగీతరావు రూ. రెండు లక్షలు తీసుకున్నారు. అయితే కొన్ని నెలలు గడిచినా ఉద్యోగం ఇప్పించకపోవడంతో తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వాలని కానిస్టేబుల్ అనిల్ దీప్తిపై ఒత్తిడి చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో అనిల్ దీప్తిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసి కేసులతో వేధింపులకు గురి చేశారు. దీంతో కానిస్టేబుల్ వేధింపులు భరించలేక దీప్తి సెల్ఫీ వీడియో తీసుకొని సూసైడ్ చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు..

కాగా సూర్యాపేట జిల్లా, హుజూర్ నగర్ మండలం, గోపాలపురంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి డివైడర్‌ను బైక్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు మృతి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు గరిడేపల్లి మండలం, కీతవారిగూడెం గ్రామానికి చెందిన దుర్గాప్రసాద్ (26), శీలం ఉపేందర్ (24) గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా ప్రదేశానికి చేరుకుని పోస్టుమార్టం నిమిత్తం మృత దేహాల్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

అలాగే మంచిర్యాల జిల్లా, బెల్లంపల్లి పట్టణంలోని జాతీయ రహదారిపై శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ డీసీఎం - కారు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

కాగా మంచిర్యాల జిల్లా, కాసిపేట మండలం, దేవాపూర్‌లోని అచ్యుతరావు గూడలోని ఓ ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలి పూరి గుడిసె దగ్ధమైంది. ఇది గమనించిన స్థానికులు మంటలను ఆర్పివేశారు. సుమారు రూ. 50 వేల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

రేషన్ బియ్యం కుంభకోణంలో విస్తుబోయే విషయాలు

శనివారం మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు

మన్మోహన్ సింగ్ మృతికి 7 రోజుల సంతాప దినాలు..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Dec 27 , 2024 | 09:35 AM