BRS: పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై బీఆర్‌ఎస్ కీలక నేతలు ఏమన్నారంటే
ABN , Publish Date - Nov 13 , 2024 | 09:40 AM
Telangana: మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని కేటీఆర్, హరీష్‌రావు వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదించే కుట్ర జరుగుతోందన్నారు. కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది అంటూ మండిపడ్డారు.
హైదరాబాద్, నవంబర్ 13: వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌పై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
(Former Minister KTR), మాజీ మంత్రి హరీష్‌రావు (Former Minister Harish Rao) స్పందించారు. ప్రజల తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదించే కుట్ర జరుగుతోందని కేటీఆర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతల అక్రమ కేసులు, అరెస్ట్ లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అని అన్నారు. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ఇలాంటి అరెస్ట్‌లు ఎన్నో చూశామని.. అయినప్పటికీ తమ పోరాటం ఆగదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎక్స్ వేదికగా ఈ మేరకు మాజీ మంత్రి పోస్టు చేశారు.
Hyderabad: మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా బంద్.. కారణం ఏంటంటే..
కేటీఆర్ ట్వీట్ ఇదే..
మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ రేవంత్ రెడ్డి చేతగాని పాలనకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. తన సొంత నియోజకవర్గంలో ప్రజలు చేసిన తిరుగుబాటును బీఆర్ఎస్కు ఆపాదించే కుట్ర జరుగుతోందన్నారు. కార్యకర్తలతో మాట్లాడిన కూడా ప్రజా ప్రతినిధులను అరెస్ట్ చేస్తున్న దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇది అంటూ మండిపడ్డారు. ప్రజలు తిరగబడుతుంటే వారిని అణిచివేసేందుకు లగచర్లలో అప్రజాస్వామిక చర్యలకు దిగారని విమర్శించారు. పట్నం నరేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అక్రమ అరెస్ట్‌లు తప్పవని బెదిరిస్తున్నారన్నారు.
ప్రజల తరపున పోరాటం చేస్తున్న బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులను అక్రమ కేసులు, అరెస్ట్‌లతో భయపెట్టాలని చూస్తే అది మూర్ఖపు చర్యే అవుతుందన్నారు. రేవంత్ రెడ్డి అప్రజాస్వామిక చర్యలపై బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఉద్యమకాలం నుంచి బీఆర్ఎస్ ఇలాంటి నిర్భంధాలు, అక్రమ అరెస్ట్‌లు ఎన్నో చూసిందని.. ఎంత అణిచి వేసే ప్రయత్నం చేస్తే అంత పోరాటం చేస్తామని వెల్లడించారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌ను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వెంటనే ఆయనను, లగచర్లలో అరెస్ట్ చేసిన రైతులను విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తూ పోస్టు చేశారు. అలాగే పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్‌ను మాజీమంత్రి హరీష్ రావు కూడా తీవ్రంగా ఖండించారు.
కాగా.. వికారాబాద్ కలెక్టర్‌పై దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈరోజు ఉదయం హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఒకరు పట్నం నరేందర్ రెడ్డితో ఎక్కువసార్లు ఫోన్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పట్నం నరేందర్ రెడ్డిని విచారించేందుకు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం అందుతోంది.
ఇవి కూడా చదవండి...
Read Latest Telangana News ANd Telugu News