Share News

Formula E race: కేటీఆర్‌పై కేసు.. అరెస్ట్ అవుతారా

ABN , Publish Date - Dec 19 , 2024 | 04:26 PM

Telangana: ఫార్ములా ఈ కార్ రేస్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై కేసు నమోదు అయ్యింది. కేటీఆర్‌‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పైనా ఏసీబీ కేసు నమోదు చేసింది. అలాగే ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డి పైన కూడా కేసు నమోదు అయ్యింది.

Formula E race: కేటీఆర్‌పై కేసు.. అరెస్ట్ అవుతారా
BRS working President KTR

హైదరాబాద్, డిసెంబర్ 19: ఫార్ములా ఈ కార్ రేస్‌లో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై (Former Minister KTR) కేసు నమోదు అయ్యింది. కేటీఆర్‌‌తో పాటు ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌పైనా ఏసీబీ (ACB) కేసు నమోదు చేసింది. అలాగే ప్రైవేట్ కంపెనీ సీఈవో బీఎల్ఎన్ రెడ్డిపై కూడా కేసు నమోదు అయ్యింది. ఏ1గా కేటీఆర్, ఏ2 ఐఏఎస్ అరవింద్‌ కుమార్‌‌ను చేరుస్తూ ఏసీబీ కేసు ఫైల్ చేసింది.

నేను చెప్పిందే జరిగింది..


ఫార్ములా ఈ రేస్ వ్యవహారానికి సంబంధించి విచారణ జరపాలంటూ ఏసీబీకి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొద్దిసేపటి క్రితమే ఈ కేసుకు సంబంధించి ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. 2023, ఫిబ్రవరి 11న ఎంతో ప్రతిష్టాత్మకంగా అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ చుట్టూ దాదాపు 2.8 కిలోమీటర్ల ఈ కార్ రేసింగ్ పెట్టింది. అయితే ఈ కార్ రేసింగ్ వ్యవహారినికి సంబంధించి దాదాపు రూ.55 కోట్ల వరకు ఆర్థిక శాఖ అనుమతి లేకుండా సంబంధిత డిపార్ట్‌మెంట్ అనుమతి లేకుండానే విదేశీ కంపెనీకి నిధులు విడుదలయ్యాయి. అయితే రూ.55 కోట్ల వ్యవహారంలో అవకతవకలు జరిగాయని, నిధుల దుర్వినియోగం జరిగాయని ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది. ఈ నిధుల గోల్‌మాల్‌పై విచారణకు సర్కార్ ఆదేశించింది. ఆర్థికశాఖ అనుమతులకు సంబంధించి ఎక్కడా రికార్డ్స్‌లో లేకపోవడంతో అనుమానాలు వ్యక్తమయ్యాయి. విదేశీ కంపెనీలకు ఇంత భారీ మొత్తాన్ని ఎలాంటి అనుమతులు లేకండా ఏ విధంగా అప్పగించారని దానిపై స్పష్టత లేకుండాపోయింది. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.


ప్రజా ప్రతినిధులపై కేసులు నమోదు చేయాలంటే గవర్నర్ అనుమతి తప్పని సరి. ఈ నేపథ్యంలో మూడు రోజుల క్రితమే రాష్ట్ర గవర్నర్ అనుమతి ఇవ్వగా.. రెండు రోజుల క్రితం సీఎస్ కూడా ఈ వ్యవహారంపై విచారణ జరపాలని ఏసీబీకి లేఖ రాసింది. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది. ఇందులో ఏ1గా అప్పటి మంత్రిగా ఉన్న కేటీఆర్, ఏ2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, ఏ3గా ప్రైవేటు కంపెనీ సీఈవో బీఎల్‌ఎన్‌ రెడ్డిని చేర్చుతూ ఎఫ్‌ఐఆర్ నమోదు అయ్యింది. ఈ కేసుకు సంబంధించి మొదటగా ఈ ముగ్గురికి నోటీసులు జారీ చేసి అనంతరం విచారణ జరుపనున్నారు.

మోహన్ బాబుకి షాకిచ్చిన హైకోర్టు


2023 ఫిబ్రవరి 11 మొదటి దఫా కార్ రేసింగ్ నిర్వహించగా, 2024 ఫిబ్రవరి 10న ఫార్ములా 10 ఈ రేసింగ్‌ కారును నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వం మారిన తర్వాత ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ రేసింగ్ నిర్వహించడంలేదని విదేశీ కంపెనీ ప్రకటించింది. దీంతో దీనిపై దృష్టి పెట్టిన కాంగ్రెస్ సర్కార్‌కు.. దాదాపు రూ.55 కోట్లు నిధులు దుర్వినియోగం అయ్యాయని గుర్తించింది. ఈ క్రమంలోనే విచారణ కొనసాగుతోంది. ఆర్థిక శాఖ, సంబంధిత శాఖ నుంచి రికార్డులను తెప్పించుకుని క్షుణ్ణంగా పరిశీలించిన ఏసీబీ.. ఇందులో అవకతవకలు జరిగాయని గుర్తించి ఆపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. ఈ కేసులో కేటీఆర్‌తో పాటు మరో ఇద్దరికి నోటీసులు జారీ అనంతరం అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ముగ్గురి విచారణ విదేశీ కంపెనీకి కూడా నోటీసులు పంపే అవకాశం ఉన్నట్లు సమాచారం.


ఇవి కూడా చదవండి...

బలగం మొగిలయ్య ఇకలేరు...

స్పిన్ యోధుడు ఆపేశాడు

Read Latest Telangana News And Telugu News

Updated Date - Dec 19 , 2024 | 04:46 PM