CM Revanth Reddy: అటవీ సంపదపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు..
ABN , Publish Date - Jul 16 , 2024 | 05:12 PM
డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి ఓపెన్ ఏరియా అటవీ భూములను గుర్తించాలని అటవీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. భూసార పరీక్షల ఆధారంగా ఆ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలని చెప్పారు. అటవీ భూముల పరిరక్షణ, నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు.
హైదరాబాద్: డ్రోన్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించి ఓపెన్ ఏరియా అటవీ భూములను గుర్తించాలని అటవీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఆదేశించారు. భూసార పరీక్షల ఆధారంగా ఆ ప్రాంతాల్లో పండ్ల మొక్కలు నాటి సంరక్షించాలని చెప్పారు. అటవీ భూముల పరిరక్షణ, నిర్వహణపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అటవీ సంపద పెంచడంపై దృష్టి సారించాలని చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, దివంగత ఎన్టీఆర్ హయాంలో అమలు చేసిన చెట్టు పట్టా విధానాన్ని పరిశీలించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి సూచించారు.
గిరిపుత్రులకు ఆదాయాన్ని సృష్టించాలి..
పండ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత గిరిజనులకు అప్పగించేలా ప్రణాళికలు రూపొందించాలని సీఎం ఆదేశించారు. అది గిరిజనులకు ఆదాయ వనరుగా మారడంతోపాటు కోతుల బెడద తగ్గే అవకాశం ఉందని అధికారులకు చెప్పారు. వాటిపై పూర్తి పర్యవేక్షణ బాధ్యత అటవీశాఖకు ఉండేలా చూసుకోవాలన్నారు. కాలువలు, చెరువు గట్ల వెంట తాటి, ఈత మొక్కలు నాటాలని ఆదేశించారు. వన మహోత్సవంలో ఉపయోగకరమైన మొక్కలు మాత్రమే నాటాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. వికారాబాద్ అడవుల్లో ఎకో టూరిజం అభివృద్ధి చేయాలని, ఇందుకు సంబంధించి పూర్తి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేయాలన్నారు. పోడు భూముల్లో పండ్ల తోటలు పెంచుకునేందుకు ప్రోత్సాహం కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించాలని అటవీ శాఖ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
Kodanda Reddy: బీఆర్ఎస్ పాఠాలు నేర్పాలని చూస్తోంది: కాంగ్రెస్ నేత కోదండరెడ్డి
Adi Srinivas: బెదిరించి చేర్చుకుంటే ఆధారాలు చూపెట్టండి: ప్రభుత్వ విప్ శ్రీనివాస్
TG News: విద్యార్థిని మృతిపై దిగ్భ్రాంతి..