TS Assembly: గంట ముందుగానే అసెంబ్లీకి సీఎం రేవంత్ రెడ్డి
ABN , Publish Date - Dec 19 , 2024 | 09:30 AM
గురువారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదట గంట సేపు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. అనంతరం భూ భారతి (ఆర్ఓఆర్) 2024 బిల్లుపై చర్చ జరుగుతుంది. ఈ బిల్లు సభలో ఆమోదం పొందుతుంది.
హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) శాసనసభకు (Assembly) గంట ముందుగానే రానున్నారు. గురువారం భూ భారతి, రైతు బరోసా తదితర అంశాలపై సభలో చర్చ ఉన్న నేపథ్యంలో పార్టీ నేతలు, అధికారులతో రేవంత్ రెడ్డి చర్చలు జరపనున్నారు.
ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల అజెండా
గురువారం ఉదయం 10 గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. మొదట గంట సేపు ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతుంది. అనంతరం భూ భారతి (ఆర్ఓఆర్) 2024 బిల్లుపై చర్చ జరుగుతుంది. ఈ బిల్లు సభలో ఆమోదం పొందుతుంది. అలాగే ఈ రోజు మరో మూడు కీలక బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెడుతుంది. తెలంగాణ మున్సిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు.., జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రవేశపెడతారు. మంత్రి సీతక్క పంచాయితీ రాజ్ చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెడతారు. ఈ రెండు అంశాలపై సభలో లఘు చర్చ జరగనుంది.
అలాగే తెలంగాణ రాష్ట్ర కీలక భాద్యతలు, రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ జరుగుతుంది. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ వార్షిక నివేదికను మంత్రి కొండ సురేఖ సభ ముందు పెట్టనున్నారు. మరోవైపు రాష్ట్రంలో రైతుల సమస్యలపై బీఆర్ఎస్ వాయిదా తీర్మానం ఇవ్వనుంది. రూ. 2 లక్షల రుణమాఫీ, రూ.15 వేల పెట్టుబడి సాయం, అన్ని పంటలకు బోనస్‌పై అసెంబ్లీలో చర్చించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేయనుంది.
ఈ వార్తలు కూడా చదవండి..
గాయకుడు బలగం మొగిలయ్య కన్నుమూత
రైతు కండువాలతో అసెంబ్లీకి బీఆర్ఎస్ నేతలు..
సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో క్యాబినెట్ సమావేశం..
ముంబై సముద్రతీరంలో పడవ ప్రమాదం
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News